1
00:01:44,145 --> 00:01:46,480
ఈ ప్రదేశంలో,

2
00:01:46,481 --> 00:01:49,901
జీవన్మరణాలు కలిసే ఉంటాయి.

3
00:01:50,568 --> 00:01:53,987
అవి పక్కపక్కనే ఉంటాయి.

4
00:01:53,988 --> 00:01:56,907
కాలంతో సంబంధం ఉండదు.

5
00:01:56,908 --> 00:02:03,289
ఇక్కడ, భూత భవిష్యత్ కాలాలు
కలగలిసిపోయి ఉంటాయి.

6
00:02:25,645 --> 00:02:27,981
స్వర్గం అంటే ఇదేనా?

7
00:02:33,611 --> 00:02:36,990
{\an8}ఆమె ఆగమనం

8
00:04:26,891 --> 00:04:28,434
ఇదిగో నిన్నే.

9
00:04:31,396 --> 00:04:32,689
ఓయ్, నీతోనే మాట్లాడుతున్నా.

10
00:04:34,148 --> 00:04:37,777
{\an8}ఇది ఎక్కడుందని అనుకుంటున్నావు?

11
00:05:10,393 --> 00:05:12,477
ఈ చోటు…

12
00:05:12,478 --> 00:05:14,188
{\an8}మరో ప్రపంచం.

13
00:05:17,025 --> 00:05:20,320
అది నిజం. నేను చనిపోయాను.

14
00:05:21,404 --> 00:05:24,573
నా బద్ధశత్రువు మీద
ప్రతీకారం తీర్చుకోవడంలో విఫలమై,

15
00:05:24,574 --> 00:05:25,908
నేను చనిపోయాను.

16
00:06:19,378 --> 00:06:25,802
{\an8}16వ శతాబ్దం చివరలో,
ఎల్సినోర్

17
00:06:31,682 --> 00:06:33,308
నాన్నా!

18
00:06:33,309 --> 00:06:34,935
స్కార్లెట్!

19
00:06:34,936 --> 00:06:38,106
అమ్మా! నాన్న తిరిగొచ్చేశారు!

20
00:06:44,487 --> 00:06:45,529
{\an8}నాన్నా!

21
00:06:45,530 --> 00:06:47,740
- స్కార్లెట్!
- బాగా గుర్తొచ్చావు!

22
00:06:48,616 --> 00:06:52,495
నీ ప్రార్థనల కారణంగానే
నేను క్షేమంగా తిరిగి రాగలిగాను.

23
00:06:55,289 --> 00:06:57,541
నీ దళాలను మోహరించు, ఆమ్లెత్.

24
00:06:57,542 --> 00:06:58,750
క్లాడియస్…

25
00:06:58,751 --> 00:07:00,836
మనమో, వాళ్లో తేలిపోవాలి.

26
00:07:00,837 --> 00:07:03,214
శాంతించు, తమ్ముడూ.

27
00:07:03,840 --> 00:07:06,091
యుద్ధం ఎవరికీ మేలు చేయదు.

28
00:07:06,092 --> 00:07:11,221
చర్చలతో సమతుల్యం సాధించేందుకు ప్రయత్నించి
శత్రుత్వం కాకుండా, నమ్మకాన్ని పెంచుకుందాం.

29
00:07:11,222 --> 00:07:13,891
మన మనుగడకు అదే ఏకైక మార్గం.

30
00:07:15,852 --> 00:07:18,396
నువ్వు పిచ్చి రాజువు!

31
00:07:23,401 --> 00:07:25,610
మన రాజు ఆమ్లెత్ మంచి పాలకుడు.

32
00:07:25,611 --> 00:07:27,362
ప్రజలందరూ ఆయనను
ఎంతో ఆరాధిస్తారు.

33
00:07:27,363 --> 00:07:30,574
పొరుగు దేశాలు సైతం
ఆయన్ని అమితంగా విశ్వసిస్తాయి.

34
00:07:30,575 --> 00:07:33,201
స్కార్లెట్. ఏమిటంత ముఖ్యమైన పని?

35
00:07:33,202 --> 00:07:35,204
శత్రుత్వం కంటే స్నేహమే మిన్న!

36
00:07:35,955 --> 00:07:38,540
మీరు కోరుకున్నట్లు
నేను అలాంటి రాకుమారిగా ఉంటాను!

37
00:07:38,541 --> 00:07:41,626
రాజకుమారి కంటే ముందు,
నువ్వు ఒక చిన్నారి ఆడపిల్లవు.

38
00:07:41,627 --> 00:07:43,712
నువ్వు ఎటువంటి భయం లేకుండా పెరగాలి.

39
00:07:43,713 --> 00:07:45,006
అయిపోయింది!

40
00:07:48,050 --> 00:07:50,011
చాలా అందంగా ఉన్నాను.
సంతోషంగా ఉంది.

41
00:08:00,521 --> 00:08:03,232
ఆమ్లెత్

42
00:08:15,536 --> 00:08:18,330
అమ్మా, నేను అవుతా…

43
00:08:18,331 --> 00:08:19,248
ఎంత మురికి చేతులు.

44
00:08:32,345 --> 00:08:34,514
నా భర్త
తన కూతురిని అతిగా ప్రేమిస్తారు.

45
00:08:35,306 --> 00:08:38,308
నీతిమంతుడి ముసుగు వేసుకున్న
పిరికివాడు ఆయన.

46
00:08:38,309 --> 00:08:42,145
నా భర్త దగ్గర అన్నీ ఉన్నాయి,
కానీ నీ దగ్గర ఏమీ లేదు.

47
00:08:42,146 --> 00:08:43,480
మీరు అన్నదమ్ములు కారా?

48
00:08:43,481 --> 00:08:44,814
కచ్చితంగా.

49
00:08:44,815 --> 00:08:49,819
అతని చెవుల్లో విషం పోయాలని
నేను ఎప్పటి నుంచో కలలు కంటున్నాను.

50
00:08:49,820 --> 00:08:53,865
అతన్ని నన్ను అవహేళన చేయనివ్వను.

51
00:08:53,866 --> 00:08:54,909
నా మాటలు గుర్తుంచుకో.

52
00:08:55,826 --> 00:08:59,288
నేను ఎవరు రాజైతే వారికే చెందుతాను.

53
00:09:00,331 --> 00:09:04,418
రాజు కావాలనే నీ సంకల్పం నిజమే అయితే,
అది నాకు నిరూపించు.

54
00:09:10,550 --> 00:09:11,925
చెడ్డ వార్త!

55
00:09:11,926 --> 00:09:13,970
కోటలో ద్రోహులు ఉన్నారు!

56
00:09:14,804 --> 00:09:17,389
వాళ్లను పట్టుకోండి!
వాళ్లు అసలు తప్పించుకోకూడదు!

57
00:09:17,390 --> 00:09:20,726
నేను చెప్పేది జాగ్రత్తగా వినండి!
వాళ్లను పోనివ్వకండి!

58
00:09:26,190 --> 00:09:27,567
ఇక్కడ ఉన్నావు.

59
00:09:37,451 --> 00:09:38,661
త్వరగా పద.

60
00:09:46,502 --> 00:09:48,588
ఆమ్లెత్, సోదరా.

61
00:09:50,423 --> 00:09:55,010
పొరుగు దేశంతో చేతులు కలిపి
నీ సొంత దేశానికే ద్రోహం చేశావు.

62
00:09:55,011 --> 00:09:57,387
సోదరా, నీకు అర్థం కావడం లేదా?

63
00:09:57,388 --> 00:10:02,142
అధికారం పట్ల నీకు గల తీరని దాహం
నిన్ను హంతకుడిగా మారుస్తోంది.

64
00:10:02,143 --> 00:10:03,393
మాట్లాడకు!

65
00:10:03,394 --> 00:10:05,645
విశ్వసనీయ ప్రజలారా!

66
00:10:05,646 --> 00:10:08,815
ద్రోహిని శిక్షించాల్సిందే!

67
00:10:08,816 --> 00:10:10,650
అప్పుడే,

68
00:10:10,651 --> 00:10:13,945
ఆ దైవ నిర్ణయం ప్రకారం,
నేనే కొత్త రాజును అవుతాను!

69
00:10:13,946 --> 00:10:16,323
మహారాజు మాకు ఎన్నటికీ ద్రోహం చేయరు!

70
00:10:16,324 --> 00:10:17,825
ఇది ఏదో పొరపాటు!

71
00:10:23,873 --> 00:10:25,249
అతనికి మరణశిక్ష విధించండి!

72
00:10:28,294 --> 00:10:29,336
నాన్నా!

73
00:10:29,337 --> 00:10:30,712
స్కార్లెట్!

74
00:10:30,713 --> 00:10:32,715
ఇలా జరగకూడదు!

75
00:10:34,925 --> 00:10:36,344
నువ్వు ఏమన్నావు?

76
00:10:37,887 --> 00:10:39,847
ఏంటి?! నువ్వు ఏం చెప్పావు?!

77
00:10:41,557 --> 00:10:42,725
ఆగండి!

78
00:10:53,110 --> 00:10:54,278
నాన్నా!

79
00:11:27,978 --> 00:11:30,773
కొత్త రాజును దేవుడు చల్లగా చూడాలి.

80
00:11:33,359 --> 00:11:36,112
రాజా క్లాడియస్ వర్థిల్లాలి!

81
00:11:36,695 --> 00:11:37,946
వర్థిల్లాలి!

82
00:11:37,947 --> 00:11:41,075
సైన్యాన్ని మోహరించి,
వాళ్ల తిరుగుబాటును అణచివేయండి.

83
00:11:46,789 --> 00:11:49,374
త్వరగా. కదలండి!

84
00:11:49,375 --> 00:11:52,127
నిజానికి, ఈ చర్యలు
తిరుగుబాటును ఆపడానికే అని చెబుతారు,

85
00:11:52,128 --> 00:11:56,048
కానీ దీనితో ఏ సంబంధం లేని
సామాన్య ప్రజలను వాళ్లు హింసిస్తున్నారు.

86
00:12:34,128 --> 00:12:36,588
"యువరాణికి ఒక వర్తమానం."

87
00:12:36,589 --> 00:12:40,508
"మీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు."

88
00:12:40,509 --> 00:12:43,262
"అయినా మహారాజు
ఎటువంటి సాయం పంపడం లేదు."

89
00:12:59,528 --> 00:13:04,115
యువరాణీ, విటెన్ బర్గ్ లో
మీ విదేశీ విద్యను ఆపి,

90
00:13:04,116 --> 00:13:07,620
మీ సౌందర్యంతో
మా కళ్లకు విందు చేయవచ్చు గదా?

91
00:13:43,155 --> 00:13:44,323
యువరాణి.

92
00:14:50,973 --> 00:14:54,893
ఎవరైనా విషం ప్రయోగించే
అవకాశం ఉందని నువ్వు అనుకోలేదా?

93
00:14:54,894 --> 00:14:57,062
పసిబిడ్డ అంతటి అమాయకత్వం.

94
00:14:59,773 --> 00:15:01,025
మూల్యం చెల్లించుకుంటావు!

95
00:15:01,775 --> 00:15:03,485
నా మాట గుర్తుంచుకో!

96
00:15:09,450 --> 00:15:11,784
యువరాణీ? ఇలా జరగకూడదు!

97
00:15:11,785 --> 00:15:12,745
యువరాణీ?

98
00:15:13,662 --> 00:15:16,206
- ఇప్పుడు మనం ఏం చేయాలి?
- యువరాణీ!

99
00:15:38,896 --> 00:15:41,230
ఇది పరలోకమే అయితే,

100
00:15:41,231 --> 00:15:43,900
నేను మళ్లీ మా నాన్నగారిని కలుస్తానా?

101
00:15:43,901 --> 00:15:45,569
లేదు, కలవలేవు.

102
00:15:46,862 --> 00:15:49,197
ఎవరు నువ్వు?

103
00:15:49,198 --> 00:15:52,408
నీ తండ్రి ఇప్పటికే శూన్యంలో కలిసిపోయారు.

104
00:15:52,409 --> 00:15:53,409
శూన్యమా?

105
00:15:53,410 --> 00:15:57,247
నువ్వు బలహీనంగా ఉంటే,
నీకు కూడా అదే గతి పడుతుంది.

106
00:16:00,834 --> 00:16:04,087
{\an8}నా జీవితం
కేవలం పశ్చాత్తాపంతోనే నిండిపోయింది.

107
00:16:04,088 --> 00:16:06,882
{\an8}ఇప్పుడే మాయమైపోవాలని నా కోరిక.

108
00:16:07,591 --> 00:16:10,385
{\an8}నేను అర్థం లేని జీవితం గడిపాను.

109
00:16:10,386 --> 00:16:12,595
{\an8}బాబాయ్ క్లాడియస్ ఇంకా బతికే ఉన్నాడు.

110
00:16:12,596 --> 00:16:14,722
{\an8}నాన్న చావుకు ప్రతీకారం తీర్చుకోలేకపోయాను.

111
00:16:14,723 --> 00:16:16,058
ఆగు.

112
00:16:16,642 --> 00:16:18,685
అతను ఇక్కడే ఉన్నాడు.

113
00:16:18,686 --> 00:16:19,644
ఏంటి?

114
00:16:19,645 --> 00:16:23,524
అతను శూన్యం అయిపోలేదు.
తను ఎక్కడో ఉండి నవ్వుకుంటున్నాడు.

115
00:17:09,820 --> 00:17:11,113
ప్రమాణం చేస్తున్నా…

116
00:17:11,739 --> 00:17:13,114
అతడిని వెతికి పట్టుకుని

117
00:17:13,115 --> 00:17:15,034
మా నాన్న మరణానికి
ప్రతీకారం తీర్చుకుంటా!

118
00:17:18,328 --> 00:17:21,248
మనుషులు ఎంతటి మూర్ఖులు.

119
00:17:22,082 --> 00:17:24,376
నీ దగ్గర హెల్సింగర్ రాజముద్ర ఉంది.

120
00:17:25,044 --> 00:17:26,794
క్లాడియస్ ఎక్కడ?

121
00:17:26,795 --> 00:17:28,255
తను ఎక్కడ ఉన్నాడు?

122
00:17:28,922 --> 00:17:30,840
- అతను ఎక్కడ?!
- నాకు చావాలని లేదు!

123
00:17:30,841 --> 00:17:33,301
వాళ్లు చనిపోయినా సరే,

124
00:17:33,302 --> 00:17:35,595
ఇప్పటికీ బతకాలని కోరుకుంటున్నారు.

125
00:17:35,596 --> 00:17:37,639
దయచేసి. దయచేసి ఆగండి!

126
00:17:38,724 --> 00:17:41,060
మనం మిత్రులం, యువరాణి గారూ.

127
00:17:41,977 --> 00:17:43,102
ఏంటి?

128
00:17:43,103 --> 00:17:45,647
మీరు నిశ్చింతగా మమ్మల్ని అనుసరించవచ్చు.

129
00:17:46,899 --> 00:17:49,358
చనిపోయిన తర్వాత కూడా,

130
00:17:49,359 --> 00:17:53,237
{\an8}పరస్పరం ద్వేషించుకోవాలనే, చంపుకోవాలనే
వాళ్ల సంకల్పమే గెలుస్తోంది.

131
00:17:53,238 --> 00:17:54,823
{\an8}క్లాడియస్ నిజంగా ఇక్కడున్నాడా?

132
00:17:57,409 --> 00:17:58,826
మిత్రులంటూ ఇంత దారుణం!

133
00:17:58,827 --> 00:18:00,454
ఈ మురికి యువరాణికి…

134
00:18:02,247 --> 00:18:03,957
మోక్షం పొందే అర్హత లేదు!

135
00:18:05,000 --> 00:18:06,210
ఆమెను బంధించండి!

136
00:18:12,800 --> 00:18:14,593
నేనిక అమరత్వంలోకి ప్రవేశించగలను!

137
00:18:15,344 --> 00:18:18,846
ఆమె ప్రతీకార వాంఛతో రగిలిపోతోంది.

138
00:18:18,847 --> 00:18:22,017
అబల అంటేనే బలహీనతకు మారుపేరు.

139
00:18:26,105 --> 00:18:27,689
అ… అది ఏంటది?!

140
00:18:29,858 --> 00:18:32,319
ఆమె మాయమైందా? వెతకండి!

141
00:18:32,945 --> 00:18:34,070
చూడు.

142
00:18:34,071 --> 00:18:38,616
ఆమెలో ఎంతటి జీవకళ
ఉట్టిపడుతుందో చూడు!

143
00:18:38,617 --> 00:18:42,161
ఆమె ఇంకా సజీవంగా,
ప్రాణాలతో ఉన్నట్లుగానే ఉంది!

144
00:18:42,162 --> 00:18:44,497
అసలు మనిషిగా ఉండటం అంటే ఏమిటి?

145
00:18:44,498 --> 00:18:45,790
మరణించడం అంటే ఏమిటి?

146
00:18:45,791 --> 00:18:48,627
జీవించడం అంటే ఏమిటి?

147
00:18:57,010 --> 00:18:58,137
అమ్మో…

148
00:18:59,888 --> 00:19:01,056
నా వల్ల కావడం లేదు…

149
00:19:03,225 --> 00:19:09,898
ప్రేమంటే ఏమిటో తెలుపు

150
00:19:10,858 --> 00:19:17,865
అది జగమంతా తెలిసిన అద్భుతమే

151
00:19:18,615 --> 00:19:23,495
ఈ మదిని నింపేనులే

152
00:19:24,872 --> 00:19:27,082
తెలుపు…

153
00:19:30,836 --> 00:19:33,337
నీకు చాలా గాయాలయ్యాయి…

154
00:19:33,338 --> 00:19:34,630
ఆపు!

155
00:19:34,631 --> 00:19:36,132
నన్ను ముట్టుకోకు!

156
00:19:36,133 --> 00:19:37,341
ఏం జరిగింది?

157
00:19:37,342 --> 00:19:39,635
- నువ్వు సన్యాసివా?
- నేను నర్స్ ను.

158
00:19:39,636 --> 00:19:42,471
- సన్యాసాశ్రమానికి పో!
- నేనొక నర్స్ నని చెప్పాను.

159
00:19:42,472 --> 00:19:43,764
నీకు తెలుసా?

160
00:19:43,765 --> 00:19:46,018
మేము ప్రజలకు సేవ చేసి
ఆరోగ్యం అందిస్తాం.

161
00:19:46,685 --> 00:19:47,768
నువ్వు చనిపోయావా?

162
00:19:47,769 --> 00:19:50,396
నేను చనిపోలేదు.

163
00:19:50,397 --> 00:19:51,689
నువ్వు పొరబడుతున్నావు.

164
00:19:51,690 --> 00:19:55,234
కచ్చితంగా ఏదోకరోజు చనిపోతాను.
కానీ నాకు ఇంకా నాడి ఆడుతోంది.

165
00:19:55,235 --> 00:19:57,236
అయితే ఇక్కడ ఉండేవాడివి కాదు.

166
00:19:57,237 --> 00:19:58,197
ఇక "ఇక్కడ" ఎక్కడ?

167
00:20:04,912 --> 00:20:06,205
దూసుకొస్తున్న బాణం.

168
00:20:08,540 --> 00:20:10,542
ఇదొక యుద్ధభూమా?

169
00:20:12,794 --> 00:20:16,673
"ఇక్కడికి వచ్చేవారు
ఆశలు వదులుకోవాల్సిందే."

170
00:20:17,299 --> 00:20:18,674
"నరక ద్వారాలు"?

171
00:20:18,675 --> 00:20:21,344
ఇది నరకమా?
నన్ను నవ్వించకు.

172
00:20:21,345 --> 00:20:23,554
స్వర్గంలో లేనందుకు నిరాశపడ్డావా?

173
00:20:23,555 --> 00:20:24,890
అంత ఆత్మవిశ్వాసం.

174
00:20:25,682 --> 00:20:30,269
మనమంతా చనిపోయాక
స్వర్గానికో, నరకానికో వెళతామని అనుకుంటారు.

175
00:20:30,270 --> 00:20:33,731
కానీ అందరూ తప్పనిసరిగా
ఇక్కడికే వస్తారు.

176
00:20:33,732 --> 00:20:36,817
ఇది మనం ఊహించిన
మరణానంతర జీవితం కాదు.

177
00:20:36,818 --> 00:20:38,402
ఒక్క నిమిషం ఆగు!

178
00:20:38,403 --> 00:20:39,947
నేను నిజంగా చనిపోలేదు.

179
00:20:40,822 --> 00:20:43,617
మాకు ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది…

180
00:20:49,206 --> 00:20:51,708
దాంతో, నేను హాస్పిటల్ నుంచి బయలుదేరాను…

181
00:20:58,632 --> 00:20:59,758
నేనేమైనా కలగంటున్నానా?

182
00:21:00,425 --> 00:21:03,302
నేను బతికే ఉంటే, ఇక్కడికెలా వచ్చాను?

183
00:21:03,303 --> 00:21:05,012
కచ్చితంగా ఏదో పొరపాటు జరిగుంటుంది!

184
00:21:05,013 --> 00:21:08,808
నేను ఇక్కడికి ఎలా వచ్చాను?
ఒట్టేసి చెప్తున్నా, నేనొక నర్సును.

185
00:21:08,809 --> 00:21:10,227
- ఎందుకు?
- ఎవరికి తెలుసు.

186
00:21:11,270 --> 00:21:13,980
ఆగు, అంటే నువ్వు కూడా చనిపోయావా?

187
00:21:13,981 --> 00:21:15,356
అవును, నిజమే.

188
00:21:15,357 --> 00:21:17,567
- నువ్వు నిజంగానే చనిపోయావా?
- అవును.

189
00:21:18,527 --> 00:21:20,069
చూస్తే అలా అనిపించడం లేదు.

190
00:21:20,070 --> 00:21:21,697
బహుశా, గాయపడ్డావేమో.

191
00:21:24,491 --> 00:21:27,326
ఏదేమైనా, నేను ఇంటికి వెళ్తున్నాను.

192
00:21:27,327 --> 00:21:28,870
నా డ్యూటీ ఇంకా అయిపోలేదు.

193
00:21:35,752 --> 00:21:36,628
నేను ఎటు వెళ్లాలి?

194
00:21:45,095 --> 00:21:46,638
- అదేంటి?
- నోరు మూసుకో.

195
00:22:18,128 --> 00:22:19,171
అద్భుతం…

196
00:22:46,531 --> 00:22:49,034
ఓయ్. ఓయ్!

197
00:22:57,209 --> 00:22:58,043
ఏంటసలు…?

198
00:23:05,509 --> 00:23:06,802
చాలా బలం…

199
00:23:52,347 --> 00:23:53,515
కార్నీలియస్!

200
00:24:10,532 --> 00:24:13,909
దివంగత రాజు ఆమ్లెత్ కూతురు, స్కార్లెట్.

201
00:24:13,910 --> 00:24:18,664
పిచ్చిదైన ఒక యువరాణి రాజు క్లాడియస్ పై
ప్రతీకారం తీర్చుకుంటోందని పుకార్లున్నాయి!

202
00:24:18,665 --> 00:24:21,167
ఈమె రాజు కూతురా?

203
00:24:21,168 --> 00:24:23,587
నీ ముఖాన్ని నేనెప్పటికీ మర్చిపోను…

204
00:24:26,256 --> 00:24:27,924
ఎప్పటికీ!

205
00:24:40,979 --> 00:24:43,940
చనిపోయిన తర్వాత కూడా పోరాడుతున్నావు…

206
00:24:49,446 --> 00:24:51,989
నువ్వొక నిజమైన యోధురాలివి.

207
00:24:51,990 --> 00:24:53,824
కానీ ఇక్కడితో అంతం కాబోతోంది.

208
00:24:53,825 --> 00:24:56,036
నువ్వు శూన్యంలో కలిసిపోతావు.

209
00:24:58,872 --> 00:25:00,081
నేను కచ్చితంగా…

210
00:25:02,584 --> 00:25:04,544
నా పగ తీర్చుకోవాలి.

211
00:25:05,378 --> 00:25:07,630
నేను ప్రతీకారం తీర్చుకోవాలి!

212
00:25:07,631 --> 00:25:08,882
అప్పటివరకూ నేను చావకూడదు!

213
00:25:09,591 --> 00:25:11,050
ఇదే అంతం.

214
00:25:11,051 --> 00:25:13,928
నేను అతన్ని శిక్షించకుండా వదిలేయలేను.

215
00:25:13,929 --> 00:25:17,349
ఏది ఏమైనా, ఇప్పుడు చాలా ఆలస్యమైంది.

216
00:25:26,983 --> 00:25:29,402
శూన్యంలో విశ్రమించు, యువరాణీ.

217
00:25:32,113 --> 00:25:34,950
అత్యవసర మరియు విషమ చికిత్స కేంద్రము

218
00:25:48,838 --> 00:25:50,839
{\an8}అబ్బా, ఛ.

219
00:25:50,840 --> 00:25:52,466
{\an8}రక్తం కారడం ఆగింది.

220
00:25:52,467 --> 00:25:54,636
రక్తనాళాలు, నరాలకు పెద్దగా దెబ్బతగల్లేదు.

221
00:25:55,553 --> 00:25:57,222
దీన్ని కదపకుండా చూసుకో.

222
00:26:03,895 --> 00:26:05,480
క్లాడియస్ ఎక్కడున్నాడు?

223
00:26:06,815 --> 00:26:07,816
సమాధానం చెప్పు!

224
00:26:09,109 --> 00:26:12,487
- అమరత్వానికి అత్యంత దగ్గరైన ప్రదేశంలో.
- ఏంటి?

225
00:26:13,238 --> 00:26:16,824
చాలా దూరంలో,
ఆ అద్భుతమైన పర్వతాల శిఖరంపై,

226
00:26:16,825 --> 00:26:19,326
అమరత్వానికి దారితీసే మెట్లు ఉన్నాయి.

227
00:26:19,327 --> 00:26:20,577
అబద్ధం!

228
00:26:20,578 --> 00:26:24,873
రాజు క్లాడియస్ పై విధేయతకు ప్రతిఫలంగా
మమ్మల్ని తీసుకెళతానని మాటిచ్చాడు.

229
00:26:24,874 --> 00:26:26,250
మా బాబాయి ఓ దుర్మార్గుడు.

230
00:26:26,251 --> 00:26:28,085
ఇదంతా పిచ్చితనం!

231
00:26:28,086 --> 00:26:33,008
అయినా ఈ పరలోకంలో అందరూ
ఆయన మోక్షం కోరుకుంటారు.

232
00:26:34,050 --> 00:26:36,051
మనుషులు బలహీనులు.

233
00:26:36,052 --> 00:26:39,722
అసలు అమరత్వం ఉందో లేదో నాకు తెలియదు,

234
00:26:39,723 --> 00:26:43,600
కానీ ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్తే,
అందుకోసం నేను ఏదైనా చేస్తాను.

235
00:26:43,601 --> 00:26:44,768
పిచ్చి సోది!

236
00:26:44,769 --> 00:26:49,315
ఏ లోకంలోనైనా, పాలించేవాళ్లు ఉంటారు,
అలాగే వాళ్లను అనుసరించేవాళ్లూ ఉంటారు.

237
00:26:49,316 --> 00:26:52,193
- నేనిది సహించను!
- నువ్వేం చేస్తున్నావు?

238
00:26:54,070 --> 00:26:55,113
ఆగు.

239
00:26:58,533 --> 00:26:59,659
నేను వెళ్లి తీరాలి.

240
00:27:04,914 --> 00:27:06,708
ఇదిగో. దీన్ని చేతికర్రలా వాడుకో.

241
00:27:08,752 --> 00:27:10,587
{\an8}నీకు గాయమైనందుకు నన్ను క్షమించు.

242
00:27:12,047 --> 00:27:14,549
నువ్వు యువరాణితో లేవా?

243
00:27:16,176 --> 00:27:19,304
నీ కుడి కాలుపై
బరువు మరీ ఎక్కువగా వేయకు.

244
00:27:32,484 --> 00:27:34,651
నేను నీకు ధన్యవాదాలు చెబుతాననుకుంటున్నావా?

245
00:27:34,652 --> 00:27:35,569
లేదు.

246
00:27:35,570 --> 00:27:37,446
అయితే నా వెనుక రావడం ఆపు.

247
00:27:37,447 --> 00:27:38,989
నువ్వొక రాక్షసివి.

248
00:27:38,990 --> 00:27:41,241
నిన్ను వదిలేస్తే మరింత మందిని చంపుతావు.

249
00:27:41,242 --> 00:27:43,869
ఇది ప్రతీకారం. కచ్చితంగా చంపుతాను.

250
00:27:43,870 --> 00:27:45,288
అయినా సరే, నువ్వు చంపకూడదు.

251
00:27:47,749 --> 00:27:50,793
నీలాంటి నీతిమంతులంటే నాకు అసహ్యం.

252
00:27:50,794 --> 00:27:51,960
నీతిమంతుడిని కాను.

253
00:27:51,961 --> 00:27:53,879
నా పేరు హిజిరి.

254
00:27:53,880 --> 00:27:56,256
అక్షరాల్లో రాస్తే
దీని అర్థం "పవిత్రం" అని.

255
00:27:56,257 --> 00:27:59,510
మనుషులకు గాయమైనప్పుడు,
రక్తం కారుతుంది.

256
00:27:59,511 --> 00:28:01,471
అందుకే నీకొక నర్సు అవసరం.

257
00:28:04,682 --> 00:28:05,892
నీకు నచ్చినట్లు చేసుకో.

258
00:29:08,538 --> 00:29:11,206
"ఆ అద్భుతమైన పర్వతాల శిఖరంపై

259
00:29:11,207 --> 00:29:14,294
అమరత్వానికి దారితీసే మెట్లు ఉన్నాయి."

260
00:29:53,500 --> 00:29:54,708
బందిపోట్లు!

261
00:29:54,709 --> 00:29:56,127
పారిపోండి!

262
00:30:06,179 --> 00:30:07,179
వదిలేయ్!

263
00:30:07,180 --> 00:30:10,725
- ఆపండి!
- వాటిని తీసుకెళ్లొద్దు!

264
00:30:16,314 --> 00:30:19,192
ఇది ఆపండి! వాళ్లు
ముసలివాళ్లని మీకు కనిపించడం లేదా?

265
00:30:26,825 --> 00:30:27,867
ఆపండి!

266
00:30:30,829 --> 00:30:31,955
వద్దు!

267
00:30:32,539 --> 00:30:33,540
ఆపండి!

268
00:30:37,877 --> 00:30:39,503
వాళ్లు అన్నీ తీసుకెళ్లిపోయారు.

269
00:30:39,504 --> 00:30:42,882
చనిపోయాక కూడా
మనం ఎందుకు ఇవన్నీ భరించాలి?

270
00:30:45,009 --> 00:30:46,135
పారిపోండి!

271
00:30:53,810 --> 00:30:54,727
తుపాకీ కాల్పులా?

272
00:31:01,276 --> 00:31:02,151
ఆ… ఆగు!

273
00:31:04,988 --> 00:31:07,198
బందిపోట్లపై బందిపోట్లు దాడి చేస్తున్నారా?

274
00:31:12,745 --> 00:31:14,038
స్పృహలోకి రా!

275
00:31:15,874 --> 00:31:16,916
అది ఇటు ఇవ్వు!

276
00:31:19,460 --> 00:31:20,628
అది కూడా!

277
00:31:22,630 --> 00:31:23,797
{\an8}ఆగు.

278
00:31:23,798 --> 00:31:24,841
ఆగు!

279
00:31:26,676 --> 00:31:27,760
ఛ!

280
00:31:40,231 --> 00:31:41,274
{\an8}కింద పడుకో.

281
00:31:50,658 --> 00:31:52,452
{\an8}పరిగెత్తు! పరిగెత్తు! పరిగెత్తు!

282
00:31:59,792 --> 00:32:00,877
అది ఇటువైపే వస్తోంది!

283
00:32:29,530 --> 00:32:30,698
అదేంటి?

284
00:32:37,622 --> 00:32:38,665
బాగానే ఉన్నావా?

285
00:32:49,801 --> 00:32:51,052
శూన్యం.

286
00:32:52,971 --> 00:32:55,932
నువ్వు అదృష్టవంతుడివి,
అతని గతి నీకు పట్టలేదు.

287
00:33:04,232 --> 00:33:06,651
నీకు సహాయం చేయలేకపోయినందుకు క్షమించు.

288
00:33:13,366 --> 00:33:16,786
నీ ముందు ఏముందో చూడు!
నిజాన్ని ఒప్పుకో, నీతిమంతుడా!

289
00:33:22,959 --> 00:33:25,002
పనిలో ఉన్నప్పుడు నేనెప్పుడూ ఇదే వింటాను.

290
00:33:25,003 --> 00:33:28,464
మరణానికి అలవాటు పడకుండా
నర్సు కాలేమని వాళ్లు చెప్తుంటారు.

291
00:33:29,340 --> 00:33:31,884
ప్రతిసారీ బాధపడుతూ ఉండలేవని.

292
00:33:34,220 --> 00:33:38,974
కానీ చావుకు అలవాటు పడిపోయి,
నీ గుండె రాయిగా మారితే,

293
00:33:38,975 --> 00:33:41,144
నువ్వు ఇంకేదో కోల్పోవచ్చు.

294
00:34:01,622 --> 00:34:07,253
ప్రేమంటే ఏమిటో తెలుపు

295
00:34:07,754 --> 00:34:13,216
అది జగమంతా తెలిసిన అద్భుతమే

296
00:34:13,217 --> 00:34:17,262
ఈ మదిని నింపేనులే

297
00:34:17,263 --> 00:34:23,019
అది జగమంతా తెలిసిన అద్భుతమే

298
00:34:34,238 --> 00:34:36,074
మనుషులమైన మనం
ఎందుకు బతుకుతున్నాం?

299
00:34:36,866 --> 00:34:38,409
జీవిత పరమార్థం ఏంటి?

300
00:34:39,243 --> 00:34:40,953
మనకది ఎప్పటికైనా అర్థమవుతుందా?

301
00:34:42,455 --> 00:34:45,666
అది బతికున్నవాళ్లకు వదిలేయ్.

302
00:34:46,709 --> 00:34:48,085
మనకిది చాలా ఆలస్యమైంది.

303
00:34:48,086 --> 00:34:51,714
నేను చెప్పానుగా, నేను ఇంకా చావలేదని.

304
00:35:01,099 --> 00:35:03,642
ముందున్న దారి చాలా ప్రమాదకరం.

305
00:35:03,643 --> 00:35:07,521
- మా బిడారులో ఎందుకు చేరకూడదు?
- ఎందుకు?

306
00:35:07,522 --> 00:35:11,526
మాకు సహాయం చేయాలని చూశావు.
నీ దయగల మనసుకు మా కృతజ్ఞతలు.

307
00:35:20,034 --> 00:35:21,451
నువ్వు రావడం లేదా?

308
00:35:21,452 --> 00:35:22,912
వాళ్లు బందిపోట్లు కావచ్చు.

309
00:35:23,830 --> 00:35:26,582
- వాళ్లు కాదు.
- ఎలా అంత కచ్చితంగా చెప్పగలవు?

310
00:35:35,633 --> 00:35:38,009
నమస్కారం, నేనొక నర్సును.

311
00:35:38,010 --> 00:35:42,139
మీకేదైనా ఇబ్బందిగా అనిపిస్తే
నాకు చెప్పండి.

312
00:35:42,140 --> 00:35:43,808
- ఎవరు నువ్వు?
- దూరంగా ఉండు.

313
00:35:44,809 --> 00:35:48,145
అలా ఉండకండి.
నేను మీకు సహాయం చేయగలను…

314
00:35:48,146 --> 00:35:50,438
- మీకు నొప్పిగా ఉంటే…
- వదిలేయ్.

315
00:35:50,439 --> 00:35:53,900
వాళ్లు ఎవరు?
వాళ్లను ఎందుకు మనతో రానిచ్చావు?

316
00:35:53,901 --> 00:35:55,569
వాళ్లు బందిపోట్లు కావచ్చు.

317
00:35:55,570 --> 00:35:57,112
వాళ్లను వెళ్లిపొమ్మను.

318
00:35:57,113 --> 00:35:59,531
మీరు పిల్లల్లా మాట్లాడుతున్నారు.

319
00:35:59,532 --> 00:36:00,741
నేను నీకేం చెప్పాను?

320
00:36:01,409 --> 00:36:03,869
అమరత్వానికి దారితీసే మెట్లా?

321
00:36:03,870 --> 00:36:06,997
వివిధ కాలాలకు, ప్రాంతాలకు చెందిన ప్రజలు
అమరత్వానికి దారితీసే

322
00:36:06,998 --> 00:36:10,792
పర్వత మార్గాన్ని రక్షించడానికి
ఒకటయ్యారని నేను విన్నాను.

323
00:36:10,793 --> 00:36:14,379
కానీ అక్కడికి చేరుకోవడం సాధ్యమో కాదో
ఎవరికీ తెలియదు.

324
00:36:14,380 --> 00:36:16,632
అది కూడా బతికున్నవాళ్ల లోకం లాంటిదే.

325
00:36:17,466 --> 00:36:20,177
నువ్వంత దూరం వెళ్లగలవని
నేను అనుకోవడం లేదు.

326
00:36:20,178 --> 00:36:23,722
కఠినమైన బంజరు భూములను,
అలాగే బందిపోట్లను

327
00:36:23,723 --> 00:36:25,599
దాటి వెళ్లాలి.

328
00:36:25,600 --> 00:36:26,766
అంతేకాదు,

329
00:36:26,767 --> 00:36:30,645
పర్వతానికి దారితీసే మార్గాన్ని
ఒక పెద్ద సైన్యం

330
00:36:30,646 --> 00:36:32,899
దిగ్బంధించిందని విన్నాను.

331
00:36:51,918 --> 00:36:54,961
పాము గాయపడింది, కానీ చావలేదు.

332
00:36:54,962 --> 00:36:57,840
నేను తండ్రిని చంపాను,
కానీ కూతురు ఇంకా వస్తూనే ఉంది.

333
00:36:59,091 --> 00:37:01,885
నా ప్రియమైన గెర్ట్రూడ్ రాకముందే

334
00:37:01,886 --> 00:37:04,513
నేను శూన్యంగా మారే
ప్రమాదాన్ని తెచ్చుకోకూడదు.

335
00:37:07,350 --> 00:37:10,353
నా హృదయం
తేళ్లతో నిండినట్లు అనిపిస్తోంది.

336
00:37:12,647 --> 00:37:13,648
వోల్టెమాండ్!

337
00:37:14,398 --> 00:37:15,608
నువ్వు ఎక్కడున్నావు?

338
00:37:35,878 --> 00:37:39,090
ఒక సైన్యంతో నేను ఎలా పోరాడగలను?

339
00:37:44,345 --> 00:37:46,554
అతని మీద ఏం పూస్తున్నావు?

340
00:37:46,555 --> 00:37:48,265
అది విషం కావచ్చు.

341
00:37:48,266 --> 00:37:50,476
- ఆగు!
- అతన్ని నిన్ను తాకనివ్వకు!

342
00:37:51,686 --> 00:37:53,813
నొప్పి తగ్గిపోతోంది.

343
00:37:54,397 --> 00:37:56,816
ఎంత విచిత్రం! నాకిప్పుడు చాలా బాగుంది.

344
00:37:57,692 --> 00:37:59,235
అదొక ఉపశమనం.

345
00:38:01,028 --> 00:38:03,780
నువ్వు నా వీపు కడుగుతావా?

346
00:38:03,781 --> 00:38:05,991
ఈ మురికి ముసలాడ్ని వదిలేయ్.

347
00:38:05,992 --> 00:38:08,868
వేడి తువ్వాలుతో తుడుచుకుంటే
చాలా హాయిగా ఉంటుంది.

348
00:38:08,869 --> 00:38:11,247
మంచి తువ్వాలు దండగ, నేను చెబుతున్నాగా.

349
00:38:15,793 --> 00:38:18,044
నీ గాయాలు నొప్పిగా ఉన్నాయా?

350
00:38:18,045 --> 00:38:19,671
లేదు…

351
00:38:19,672 --> 00:38:21,298
{\an8}అవి చాలానే ఉన్నాయి.

352
00:38:21,299 --> 00:38:25,010
మేము బిడారును రక్షించిన ప్రతిసారీ
ఒక మచ్చ పడింది.

353
00:38:25,011 --> 00:38:26,512
అవి గౌరవ పతకాల లాంటివా?

354
00:38:27,346 --> 00:38:29,724
అవును, కచ్చితంగా!

355
00:38:35,980 --> 00:38:38,898
ఇది చాలా ఊరటగా ఉంది.

356
00:38:38,899 --> 00:38:40,150
నాకు సంతోషంగా ఉంది.

357
00:38:40,151 --> 00:38:43,570
ఏ చిన్న కదలికైనా
నా శరీరానికి నొప్పి కలిగిస్తుంది.

358
00:38:43,571 --> 00:38:45,530
కంగారు పడాల్సిన పనిలేదు.

359
00:38:45,531 --> 00:38:49,451
నా చేతులు మొద్దుబారిపోతున్నాయి.

360
00:38:49,452 --> 00:38:53,788
నీ కదలికలపై ధ్యాస పెట్టు,
అప్పుడు నీ స్పర్శ కోల్పోవు.

361
00:38:53,789 --> 00:38:55,915
తర్వాత నేను రావచ్చా?

362
00:38:55,916 --> 00:38:58,669
- నేను కూడా.
- నేను కూడా.

363
00:39:14,185 --> 00:39:16,269
ఇదేం మాయ?

364
00:39:16,270 --> 00:39:17,729
ఎలాంటి మాయా లేదు.

365
00:39:17,730 --> 00:39:20,775
నేను వాళ్లు చెప్పేది విన్నాను అంతే.

366
00:39:22,193 --> 00:39:23,194
బహుశా…

367
00:39:24,820 --> 00:39:26,404
నువ్వు నా అంచనా కంటే మెరుగే.

368
00:39:26,405 --> 00:39:30,116
వీచే గాలికి ఇసుకపై గీసిన అలల ఆకారం

369
00:39:30,117 --> 00:39:35,205
నా ఊరి సంద్రం తెచ్చెను జ్ఞాపకం

370
00:39:35,206 --> 00:39:36,707
ఇదిగో.

371
00:39:38,709 --> 00:39:39,834
ఒకసారి తిని చూద్దాం.

372
00:39:39,835 --> 00:39:45,800
గవ్వను నా చెంపకు ఆన్చగా
గత జ్ఞాపకాల స్వరం వినిపించెనే కమ్మగా

373
00:39:57,978 --> 00:40:00,856
ఇతరులను నమ్మనందుకు
నిన్ను తప్పుబట్టను.

374
00:40:01,607 --> 00:40:04,651
మేము కూడా మొదట్లో నీలాగే ఉండేవాళ్లం.

375
00:40:04,652 --> 00:40:08,405
కానీ నువ్వు ఎంతగా దెబ్బలు తింటావో,
దోపిడీకి, మోసానికి గురవుతావో,

376
00:40:08,406 --> 00:40:10,324
అంతగా ఒకరిని నమ్మాలని ఆరాటపడతావు.

377
00:40:11,075 --> 00:40:15,912
కచ్చితంగా ఈ ప్రపంచం
భయంకరమైన ప్రదేశం,

378
00:40:15,913 --> 00:40:19,417
అందుకే నమ్మడానికి ఏదైనా
ఒకదాని కోసం అందరూ పరితపిస్తారు.

379
00:40:25,881 --> 00:40:29,467
ఇంత చిన్న వయసులో ఇక్కడికి పడిపోవడానికి

380
00:40:29,468 --> 00:40:32,346
నువ్వు ఏదో పెద్దగా
పశ్చాత్తాపపడుతూ ఉంటావు.

381
00:40:34,807 --> 00:40:41,896
సంబరంగా నాట్యం చేద్దాం
రాత్రి గడిచి వేకువొచ్చే దాకా

382
00:40:41,897 --> 00:40:45,900
అపురూప గీతం పాడుకుందాం

383
00:40:45,901 --> 00:40:49,779
ఈ ప్రపంచపు అంచుల దాకా

384
00:40:49,780 --> 00:40:54,284
కలకాలం నాట్యం చేద్దాం

385
00:40:54,285 --> 00:40:58,456
వేళ్లు పెనవేసుకుని
వీచేటి గాలిలోన

386
00:40:59,290 --> 00:41:02,167
కలకాలం పాడుకుందాం

387
00:41:02,168 --> 00:41:06,754
మదిలోతులు కలిసేలా చేతులు పట్టుకుని

388
00:41:06,755 --> 00:41:09,048
మాకు జీవం ఈయవా

389
00:41:09,049 --> 00:41:14,471
నచ్చిన చోటుకు ఈదుకుపోయేలా

390
00:41:14,472 --> 00:41:19,767
మాకు జీవం ఈయవా
మా ఖాళీ మనసులో నింపేలా

391
00:41:19,768 --> 00:41:21,269
చాలా దారుణం.

392
00:41:21,270 --> 00:41:23,563
- ఇంతకంటే ఘోరం ఏనాడూ చూడలేదు.
- అది డాన్స్ అనాలా?

393
00:41:23,564 --> 00:41:26,567
- ఇది బాగాలేదు.
- ఇంతకంటే ఘోరం నేనెప్పుడూ చూడలేదు.

394
00:41:30,738 --> 00:41:34,324
సంబరంగా నాట్యం చేద్దాం

395
00:41:34,325 --> 00:41:37,911
రాత్రి గడిచి వేకువొచ్చే దాకా

396
00:41:37,912 --> 00:41:43,626
అపురూప గీతం పాడుకుందాం
ఈ ప్రపంచపు అంచుల దాకా

397
00:41:44,502 --> 00:41:47,837
కలకాలం నాట్యం చేద్దాం

398
00:41:47,838 --> 00:41:52,676
వేళ్లు పెనవేసుకుని
వీచేటి గాలిలోన

399
00:41:53,677 --> 00:41:57,389
మనుషుల మాటలు దేవుడికి అర్థం కావు.

400
00:42:00,976 --> 00:42:03,812
అందుకే మేము మా భావాలను
నాట్యం ద్వారా తెలియజేస్తాం.

401
00:42:09,235 --> 00:42:11,444
మాకు జీవం ఈయవా

402
00:42:11,445 --> 00:42:16,533
మా ఖాళీ మనసులో నింపేలా

403
00:42:16,534 --> 00:42:20,788
జీవించు! సంతోషించు! వర్ధిల్లు!

404
00:42:44,979 --> 00:42:48,189
మేము ముందున్న పట్టణంలో సరుకులు దింపుతాం.

405
00:42:48,190 --> 00:42:50,818
నీ గమ్యం అటువైపే ఉంది.

406
00:42:51,735 --> 00:42:53,361
మీరు చాలా దయగలవారు.

407
00:42:53,362 --> 00:42:56,240
నీ కోరికలు నెరవేరాలని
నేను ప్రార్థిస్తున్నాను.

408
00:42:56,824 --> 00:42:58,200
చాలా కృతజ్ఞతలు.

409
00:42:59,618 --> 00:43:01,203
బాగా సాధన చెయ్.

410
00:43:17,052 --> 00:43:19,220
ముసలివాళ్లు దాని గురించి చెప్పారు.

411
00:43:19,221 --> 00:43:20,930
ఈ "అమరత్వం" ఉన్న చోట,

412
00:43:20,931 --> 00:43:23,851
నువ్వు ఎన్నడూ చూడని
అతి అందమైన సముద్రం ఉంది!

413
00:43:24,977 --> 00:43:26,061
సముద్రమా?

414
00:43:26,562 --> 00:43:29,230
వాళ్లు చాలా పెద్ద చిరునవ్వుతో
ఆ మాట చెప్పారు.

415
00:43:29,231 --> 00:43:32,943
నేను వాళ్లలాగే
ముసలివాడిని కావాలనుకుంటున్నాను.

416
00:43:37,781 --> 00:43:39,033
అదేంటి?

417
00:43:58,427 --> 00:43:59,470
వద్దు!

418
00:44:13,442 --> 00:44:15,318
మళ్లీ పోరాడటానికి వెళ్తున్నావా?

419
00:44:15,319 --> 00:44:17,153
కచ్చితంగా నా ప్రతీకారం తీర్చుకోవాలి.

420
00:44:17,154 --> 00:44:20,156
నేను అతన్ని స్పృహ కోల్పోయేలా
చేయడం కంటే ఎక్కువే చేస్తాను.

421
00:44:20,157 --> 00:44:23,410
అత్యుత్తమ విలుకాడి గురించి
ఒక చైనా కథ ఉంది.

422
00:44:24,578 --> 00:44:26,913
అతను కనిపించని విల్లుతో బాణాలను వేస్తాడు.

423
00:44:26,914 --> 00:44:29,332
నువ్వు కలలు కనడం మానేస్తే ఎలా ఉంటుంది?

424
00:44:29,333 --> 00:44:30,750
నువ్వు ఆపాలని కోరుతున్నాను.

425
00:44:30,751 --> 00:44:32,960
భవిష్యత్తులో ఎలాంటి యుద్ధాలు ఉండవా?

426
00:44:32,961 --> 00:44:35,797
- ఉంటాయనే నా భయం.
- అదే నీ సమాధానం.

427
00:44:35,798 --> 00:44:41,094
కానీ అదే సమయంలో, మనలో చాలా మంది కోరుకునేది
ప్రపంచం ఈ హింస నుండి బయటపడాలని.

428
00:44:41,095 --> 00:44:44,889
అది ఎక్కడో ఒకచోట ఆగకపోతే,
యుద్ధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.

429
00:44:44,890 --> 00:44:48,935
నీ కాలంలో జరుగుతున్న యుద్ధాలకు
మేమే కారణమని అంటున్నావా?

430
00:44:48,936 --> 00:44:51,230
అలా అని కాదు. కానీ…

431
00:44:52,356 --> 00:44:53,565
నువ్వేం చేస్తున్నావు…?

432
00:44:54,983 --> 00:44:55,818
ఆగు!

433
00:45:00,989 --> 00:45:03,117
- దళాధిపతి వోల్టెమాండ్.
- ఏంటి?

434
00:45:03,909 --> 00:45:05,743
రాయబారి వస్తున్నాడా?

435
00:45:05,744 --> 00:45:08,454
లొంగిపోవడానికి చేతులు ఊపుతున్నాడా?

436
00:45:08,455 --> 00:45:10,124
ఇది పనిని సులువు చేస్తుంది.

437
00:45:12,835 --> 00:45:14,377
యుద్ధం ఆపండి!

438
00:45:14,378 --> 00:45:15,711
ఏంటి?!

439
00:45:15,712 --> 00:45:17,922
మనం మాట్లాడుకోవచ్చు. ఆయుధాలు వద్దు!

440
00:45:17,923 --> 00:45:19,174
అసలు ఎవరు నువ్వు?

441
00:45:21,093 --> 00:45:23,720
అయినా నిన్ను నువ్వు
యోధుడివని పిలుచుకుంటావా?

442
00:45:31,812 --> 00:45:33,312
ఇతనికి ఏమైంది?

443
00:45:33,313 --> 00:45:34,313
ఎంతటి పిరికివాడు!

444
00:45:34,314 --> 00:45:36,525
అతని ముక్కు, చెవులు కోసేయండి!

445
00:45:37,526 --> 00:45:38,777
ఆపండి!

446
00:45:46,410 --> 00:45:47,786
యువరాణి!

447
00:45:56,462 --> 00:45:57,463
స్కార్లెట్!

448
00:46:12,269 --> 00:46:14,520
నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు!

449
00:46:14,521 --> 00:46:16,273
జాగ్రత్త! యువరాణిని పట్టుకోండి!

450
00:46:23,822 --> 00:46:26,700
ఆమె యువరాణా లేక అడవి జంతువా?
అబ్బా ఛ!

451
00:46:39,755 --> 00:46:41,507
వోల్టెమాండ్.

452
00:46:42,132 --> 00:46:44,800
నువ్వు నా మనుషులను
చాలా మందిని గాయపరిచావు.

453
00:46:44,801 --> 00:46:46,053
నిన్ను ఎప్పటికీ క్షమించను!

454
00:46:46,845 --> 00:46:47,971
ఇది ఆపు, స్కార్లెట్!

455
00:47:00,984 --> 00:47:03,320
పారిపోండి! వెంటనే!

456
00:47:04,112 --> 00:47:06,448
- గుంతల్లో దాక్కోండి!
- గుర్రాలను తీసుకురండి!

457
00:47:12,246 --> 00:47:13,539
ఆ వ్యక్తి…

458
00:47:14,289 --> 00:47:17,542
అతని కాల్పుల విరమణ మన అప్రమత్తతను
తగ్గించడానికి వేసిన ఎత్తుగడ.

459
00:47:17,543 --> 00:47:19,085
ఎంతటి మోసం.

460
00:47:19,086 --> 00:47:20,128
అలాగే క్షమించరానిది.

461
00:47:25,551 --> 00:47:26,718
స్కార్లెట్!

462
00:47:28,637 --> 00:47:31,056
అరెరే! ఇంకొక్కటి!

463
00:47:35,561 --> 00:47:36,936
నువ్వేం చేస్తున్నావు?

464
00:47:36,937 --> 00:47:38,272
నువ్వు నన్ను వదిలేయాల్సింది!

465
00:47:40,107 --> 00:47:41,232
నాకు తెలియదు.

466
00:47:41,233 --> 00:47:44,069
నువ్వు కూడా నన్ను వదిలేయాల్సింది.

467
00:47:51,159 --> 00:47:55,413
నేను కూడా శూన్యంలో
కలిసిపోతానేమోనని అనిపిస్తోంది.

468
00:47:55,414 --> 00:47:57,833
నేను చేయగలిగినదంతా చేస్తున్నాను.
ఆశ వదిలేయకు!

469
00:47:58,542 --> 00:47:59,710
నీ స్లీవ్ కోస్తున్నాను.

470
00:48:01,128 --> 00:48:03,713
- ఆపు…
- నీ చేతిని కదుపు.

471
00:48:03,714 --> 00:48:05,507
ఇది ఇబ్బందిగా ఉంది.

472
00:48:13,890 --> 00:48:15,559
{\an8}ఇది నొప్పి పెడుతుంది.

473
00:48:21,857 --> 00:48:24,318
నువ్వు ఈ పనిని ఎందుకు ఎంచుకున్నావు?

474
00:48:25,027 --> 00:48:28,905
{\an8}ప్రజలకు సహాయం చేయడానికి
ఒక నర్సు చాలా కష్టపడడం చూశాను.

475
00:48:30,616 --> 00:48:32,075
అందుకే నేనూ చేయాలనుకున్నాను.

476
00:48:35,871 --> 00:48:37,163
నీకు పిచ్చి అనుకుంటా.

477
00:48:37,164 --> 00:48:38,957
నువ్వు నీ చేతిని కదపగలవా?

478
00:48:41,043 --> 00:48:43,462
ఏవైనా నరాలు దెబ్బతిన్నాయని
ఏమాత్రం అనిపించడం లేదు.

479
00:48:44,296 --> 00:48:46,465
కానీ నువ్వు కొంత కాలం
విశ్రాంతి తీసుకోవాలి.

480
00:49:12,407 --> 00:49:13,742
ఇప్పుడే చెప్పాను కదా…

481
00:49:25,253 --> 00:49:26,629
నన్ను క్షమించు.

482
00:49:26,630 --> 00:49:28,548
- నేను క్షమించను.
- నేను వేడుకుంటున్నాను!

483
00:49:29,132 --> 00:49:31,384
నువ్వు మా నాన్నపై ఎలాంటి జాలి చూపించలేదు.

484
00:49:31,385 --> 00:49:33,469
ఆగు. నా మాట విను.

485
00:49:33,470 --> 00:49:35,638
నేను రాజును చంపలేదు.

486
00:49:35,639 --> 00:49:37,724
- నీ అబద్ధాలు ఆపు!
- కానీ అదే నిజం.

487
00:49:38,350 --> 00:49:41,353
ఎందుకంటే ఆయన మాట విన్నాను.
ఆయన గుసగుసగా చెప్పినవి విన్నాను.

488
00:49:42,229 --> 00:49:43,313
గుసగుసగా ఏం చెప్పారు?

489
00:49:44,356 --> 00:49:46,233
ఏంటి? నువ్వు ఏమన్నావు?!

490
00:49:48,610 --> 00:49:49,777
ఆయన మాటలు వినబడలేదు!

491
00:49:49,778 --> 00:49:53,572
నీకు వినబడలేదు, కానీ ఆయన పక్కనే ఉన్నాను.
నేను విన్నాను.

492
00:49:53,573 --> 00:49:55,533
నా చేతులు గడ్డకట్టుకుపోయాయి.

493
00:49:55,534 --> 00:49:59,286
కార్నీలియస్ కూడా అది విన్నాడని
నాకు కచ్చితంగా తెలుసు.

494
00:49:59,287 --> 00:50:01,747
మేము మా కత్తులు పైకి ఎత్తలేకపోయాం.

495
00:50:01,748 --> 00:50:04,709
నాకు ఏమీ వినబడలేదు!

496
00:50:04,710 --> 00:50:06,502
{\an8}నీకు తెలుసుకోవాలని లేదా?

497
00:50:06,503 --> 00:50:10,674
{\an8}నన్ను ఇప్పుడు చంపితే, అప్పుడు
రాజు చివరి మాటలు నీకు ఎప్పటికీ తెలియవు.

498
00:50:13,135 --> 00:50:16,095
{\an8}అబద్ధాలు! నీ ప్రాణాలు కాపాడుకోడానికి
అబద్ధం ఆడుతున్నావు!

499
00:50:16,096 --> 00:50:19,306
{\an8}ఒక యోధుడిగా నా ఆత్మసాక్షిగా
ప్రమాణం చేస్తున్నాను.

500
00:50:19,307 --> 00:50:20,559
{\an8}అబద్ధాలకోరు!

501
00:50:30,610 --> 00:50:31,902
మరీ మంచిది.

502
00:50:31,903 --> 00:50:36,074
నువ్వు చెప్తే, నిన్ను వదిలేస్తాను.
యోధురాలిగా ఆత్మ ప్రమాణం చేస్తున్నా.

503
00:50:41,246 --> 00:50:43,164
కానీ నిజం చెప్పు.

504
00:50:43,165 --> 00:50:44,374
ఆయన ఏమన్నారు?

505
00:50:48,879 --> 00:50:50,046
ఒకే ఒక్క మాట.

506
00:50:51,006 --> 00:50:52,298
"క్షమించు."

507
00:50:52,299 --> 00:50:53,675
"క్షమించు" అనా?

508
00:50:54,718 --> 00:50:57,512
ఎందుకు? ఆయన ఎందుకలా అంటాడు?

509
00:51:08,482 --> 00:51:12,318
పొలోనియస్. నువ్వు ఎప్పుడూ
శుభవార్తలు తీసుకొస్తావు.

510
00:51:12,319 --> 00:51:15,113
వోల్టెమాండ్ విఫలమయ్యాడని
నాకు సమాచారం అందింది.

511
00:51:16,823 --> 00:51:21,118
కార్నీలియస్ లాగే, వాడు కుంగిపోయే వరకూ
అలాగే తన అసమర్థత గురించి

512
00:51:21,119 --> 00:51:23,245
తనకు తెలిసే వరకు శిక్షించాలి.

513
00:51:23,246 --> 00:51:26,916
వాడు అమరత్వం గురించి మర్చిపోతాడు.

514
00:51:26,917 --> 00:51:31,462
లేర్టెస్ ఇంకా నేను యువరాణిని పట్టుకుని
ఆమెను ముక్కలు ముక్కలుగా నరుకుతాం.

515
00:51:31,463 --> 00:51:32,631
అయితే వెళ్లండి.

516
00:51:40,388 --> 00:51:43,182
క్లాడియస్ ప్రభూ! దయచేసి
మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లండి!

517
00:51:43,183 --> 00:51:46,853
దయచేసి మమ్మల్ని
అమరత్వం దగ్గరికి తీసుకెళ్లండి!

518
00:51:49,189 --> 00:51:51,273
నాతో కలిసి పోరాడే వాళ్లను అందరినీ

519
00:51:51,274 --> 00:51:54,902
ఎవరినీ వదలకుండా
నేను అమరత్వం దగ్గరికి తీసుకెళ్తాను!

520
00:51:54,903 --> 00:51:58,113
కృతజ్ఞతలు, క్లాడియస్ ప్రభూ!

521
00:51:58,114 --> 00:52:01,867
చాలా కృతజ్ఞతలు!

522
00:52:01,868 --> 00:52:03,995
ఎంచుకోబడిన యోధులారా!

523
00:52:04,788 --> 00:52:06,706
నా పట్ల మీ విధేయతను ప్రకటించండి!

524
00:52:07,624 --> 00:52:09,166
భయపడకండి!

525
00:52:09,167 --> 00:52:10,335
పోరాడండి!

526
00:52:14,047 --> 00:52:22,305
అమరత్వం కోసం!

527
00:52:26,226 --> 00:52:27,560
"క్షమించు".

528
00:52:27,561 --> 00:52:30,479
మా నాన్న నిజంగా అలా అని ఉంటే,

529
00:52:30,480 --> 00:52:32,524
"క్షమించు" అనడంలో ఆయన అర్థం ఏంటి?

530
00:52:33,567 --> 00:52:35,776
బహుశా ఆయన వేడుకుంటున్నారేమో,

531
00:52:35,777 --> 00:52:38,654
"దయచేసి నన్ను చంపవద్దు.
నన్ను క్షమించండి," అని.

532
00:52:38,655 --> 00:52:41,574
మా నాన్న ఏనాడూ చావుకు భయపడలేదు
లేదా క్షమించుమని బతిమాలలేదు.

533
00:52:41,575 --> 00:52:44,994
లేదా ఆయన ఏదైనా
భయంకరమైన పాపం దాస్తున్నాడేమో.

534
00:52:44,995 --> 00:52:46,370
అందుకే క్షమాపణ కోరాడేమో.

535
00:52:46,371 --> 00:52:49,790
- అది ఆయన పద్ధతి కాదు.
- నువ్వు ఏమనుకుంటున్నావు?

536
00:52:49,791 --> 00:52:54,212
రాజుగా తన ప్రజలకు ఏమీ చేయలేకపోయానని
బహుశా ఆయన సిగ్గుపడుతున్నాడేమో.

537
00:52:55,130 --> 00:52:56,755
కానీ అది నిజం కాగలదా?

538
00:52:56,756 --> 00:52:59,008
నేనే మీ నాన్నను అయితే,

539
00:52:59,009 --> 00:53:03,637
నిన్ను పెంచలేకపోయినందుకు
నేను బాధపడేవాడిని.

540
00:53:03,638 --> 00:53:06,265
"క్షమించు, నేను ఒక చెడ్డ తండ్రిని," అని.

541
00:53:06,266 --> 00:53:08,893
వీటన్నింటికీ వేర్వేరు అర్థాలున్నాయి.

542
00:53:08,894 --> 00:53:10,729
ఆయన నిజమైన ఉద్దేశం ఏంటి?

543
00:53:12,522 --> 00:53:14,774
దాన్ని మరోలా చూడవచ్చు.

544
00:53:16,610 --> 00:53:18,194
ఇది నా అభిప్రాయం మాత్రమే.

545
00:53:19,404 --> 00:53:21,489
- నేను చెప్పవచ్చా?
- ఏంటది?

546
00:53:22,282 --> 00:53:25,784
"నువ్వు ద్వేషించే వ్యక్తిని క్షమించు.
క్లాడియస్ ను క్షమించు."

547
00:53:25,785 --> 00:53:28,203
కానీ ఎందుకు? ఎందుకు?

548
00:53:28,204 --> 00:53:29,872
అతను మా నాన్నను చంపాడు.

549
00:53:29,873 --> 00:53:33,083
మా దేశాన్ని, మా ఇంటిని,
అన్నింటినీ దొంగిలించాడు!

550
00:53:33,084 --> 00:53:36,045
అలాంటి దుర్మార్గుడిని
నేను ఎప్పటికీ క్షమించలేను.

551
00:53:36,046 --> 00:53:40,341
నువ్వు అలాంటి దుర్మార్గుడిని కూడా
క్షమించాలని కోరుకున్నాడని నమ్ముతున్నాను.

552
00:53:40,342 --> 00:53:41,425
ఎప్పటికీ క్షమించలేను!

553
00:53:41,426 --> 00:53:44,470
నేనూ ఒప్పుకుంటాను.
సాధువు కూడా అలా చేయలేడు.

554
00:53:44,471 --> 00:53:45,596
అయితే…

555
00:53:45,597 --> 00:53:49,892
కానీ నేను ఆయన మాటలు నేరుగా విన్నాను,
అందుకే నాకు అలా అనిపిస్తోంది.

556
00:53:49,893 --> 00:53:53,103
రాజుగారి నిజం
నాతో మాట్లాడినట్లు నాకు అనిపించింది.

557
00:53:53,104 --> 00:53:55,105
"నిజం" అంటే నీ ఉద్దేశం ఏంటి?

558
00:53:55,106 --> 00:53:56,982
నాకు అర్థం కాలేదు. అదేంటి?

559
00:53:56,983 --> 00:53:58,359
నేనెందుకు క్షమించాలి?

560
00:53:58,360 --> 00:54:03,490
అత్యంత క్షమించరాని ఆ దుర్మార్గుడిని
మా నాన్న ఎందుకు క్షమించుమంటాడు? ఎందుకు?

561
00:54:06,326 --> 00:54:07,410
ఎందుకు?

562
00:54:09,746 --> 00:54:11,538
నువ్వు మమ్మల్ని విడిచిపెడుతున్నావా?

563
00:54:11,539 --> 00:54:15,126
మా గాయపడిన వాళ్లను మినహాయిస్తే,
మేము నిన్ను సులభంగా ఓడించగలం.

564
00:54:16,294 --> 00:54:19,171
వోల్టెమాండ్, నువ్వు అలా చేయవు.

565
00:54:19,172 --> 00:54:22,801
అప్పుడే మర్చిపోయావా?
నేను నిన్ను కాల్చడానికి ప్రయత్నించాను.

566
00:54:36,272 --> 00:54:37,524
వెళదాం పదండి.

567
00:55:05,260 --> 00:55:08,637
నేను ఇన్నాళ్లూ దేనికోసం పోరాడుతున్నాను?

568
00:55:08,638 --> 00:55:10,264
క్షమించు.

569
00:55:10,265 --> 00:55:11,223
ఎందుకు?

570
00:55:11,224 --> 00:55:12,976
క్షమించు.

571
00:55:35,915 --> 00:55:37,167
క్షమించు!

572
00:55:40,003 --> 00:55:41,880
క్షమించు…

573
00:55:44,090 --> 00:55:49,054
నా ఆలోచనలన్నీ
మా నాన్న కోసం ప్రతీకారం తీర్చుకోవాలనే.

574
00:55:51,306 --> 00:55:52,557
అయినా సరే…

575
00:56:01,316 --> 00:56:02,733
అయినా సరే…

576
00:56:02,734 --> 00:56:03,610
క్షమించు.

577
00:56:05,528 --> 00:56:07,322
క్షమించు.

578
00:56:45,652 --> 00:56:47,111
నువ్వేం చేస్తున్నావు?

579
00:56:47,112 --> 00:56:49,446
లోపల చూడాలనుందా?

580
00:56:49,447 --> 00:56:51,532
- లోపలా?
- అలెగ్జాండర్.

581
00:56:51,533 --> 00:56:53,033
- ఏంటి?
- సీజర్.

582
00:56:53,034 --> 00:56:55,786
- అసాధ్యం!
- ఇది ఇంకా తాజాగానే ఉంది.

583
00:56:55,787 --> 00:56:58,163
నువ్వు ఎక్కువగా
తెలుసుకోవాలని కోరుకునే మనిషి.

584
00:56:58,164 --> 00:56:59,832
అలా కాకపోవచ్చు…

585
00:56:59,833 --> 00:57:01,583
అందులో మా నాన్న ఉండవచ్చా?

586
00:57:01,584 --> 00:57:03,335
- నాన్నా!
- నాన్నా!

587
00:57:03,336 --> 00:57:04,336
నాన్నా!

588
00:57:04,337 --> 00:57:07,423
నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది!
చెప్పండి, నాన్నా!

589
00:57:07,841 --> 00:57:09,634
- చెప్పండి!
- నాన్నా!

590
00:57:33,575 --> 00:57:38,455
- నువ్వు నిజంగా తెలుసుకోవాలని కోరుకునేది…
- నీ గురించే!

591
00:58:07,484 --> 00:58:11,945
నువ్వు పూర్తిగా వేరే జీవితాన్ని గడిపితే
ఎలా ఉండేదో ఊహించుకో.

592
00:58:11,946 --> 00:58:13,114
అది ఎలా ఉండేది?

593
00:58:14,365 --> 00:58:17,326
వీధిలో నడుస్తూ ఐస్ క్రీం తినడం.

594
00:58:17,327 --> 00:58:20,120
లేదా రోడ్డు పక్కన కేఫ్ లో
కబుర్లు చెప్పుకోవడం.

595
00:58:20,121 --> 00:58:23,040
లేదా దుకాణం అద్దంలోంచి
తొంగి చూసి, ఆ తర్వాత…

596
00:58:23,041 --> 00:58:26,460
క్షమించు, కానీ నువ్వు చెప్పేది
వేరే ప్రపంచం గురించి.

597
00:58:26,461 --> 00:58:27,795
అదేంటో నాకసలు తెలియదు.

598
00:58:28,880 --> 00:58:31,340
నా పరిస్థితి చూసి
నువ్వు జాలిపడుతున్నావనుకుంటా.

599
00:58:31,341 --> 00:58:33,592
కానీ నన్ను నేను అలా చూసుకోలేను.

600
00:58:33,593 --> 00:58:35,844
నా జీవితాన్ని నేను మార్చుకోగలనని కాదు.

601
00:58:35,845 --> 00:58:37,388
ఇది నేను గడిపిన జీవితం.

602
00:58:38,473 --> 00:58:42,268
ఒకవేళ నువ్వు మళ్లీ చనిపోయి
శాశ్వతంగా కనుమరుగైపోయినా అంతేనా?

603
00:58:43,770 --> 00:58:44,979
నాకు భయం లేదు.

604
00:58:45,939 --> 00:58:49,525
నిజానికి, మా నాన్నను చంపినవాడిపై
ప్రతీకారం తీర్చుకోగానే

605
00:58:49,526 --> 00:58:51,444
నేను మాయమైపోవాలని కోరుకుంటున్నాను.

606
00:58:54,447 --> 00:58:57,700
విను. సుదూర భవిష్యత్తు నుంచి వచ్చిన
ప్రముఖ పాట ఇదిగో.

607
00:58:58,785 --> 00:59:05,792
ప్రేమంటే ఏమిటో తెలుపు

608
00:59:06,501 --> 00:59:13,508
అది జగమంతా తెలిసిన అద్భుతమే

609
00:59:14,551 --> 00:59:20,055
ఈ మదిని నింపేనులే

610
00:59:20,056 --> 00:59:27,063
ప్రేమ గురించిన ప్రతీదీ తెలుపు

611
00:59:27,897 --> 00:59:32,901
అదే నా జీవన గమ్యం

612
00:59:32,902 --> 00:59:39,534
నా మనసు చేజారకముందే

613
01:00:48,186 --> 01:00:53,690
ప్రేమంటే ఏమిటో తెలుపు

614
01:00:53,691 --> 01:00:59,112
అది జగమంతా తెలిసిన అద్భుతమే

615
01:00:59,113 --> 01:01:03,450
ఈ మదిని నింపేనులే

616
01:01:03,451 --> 01:01:09,122
ప్రేమ గురించిన ప్రతీదీ తెలుసుకోవాలి

617
01:01:09,123 --> 01:01:14,878
ఎక్కడో దాగిన ఓ రహస్యం

618
01:01:14,879 --> 01:01:18,256
దానికి తాళం వెతుకు

619
01:01:18,257 --> 01:01:19,092
{\an8}హిజిరి!

620
01:01:27,600 --> 01:01:29,559
ఎన్నో కలయికలు

621
01:01:29,560 --> 01:01:33,439
అనంతమైన ఈ కాల ప్రవాహంలో

622
01:01:35,316 --> 01:01:37,192
నిన్ను కలుస్తాను

623
01:01:37,193 --> 01:01:40,195
మనం అనుకున్న సమయానికి

624
01:01:40,196 --> 01:01:42,739
{\an8}అది… నేనే!

625
01:01:42,740 --> 01:01:46,451
నా కంట పడే ప్రతీదీ

626
01:01:46,452 --> 01:01:49,913
కాంతిమయంగా మెరిసిపోతోంది

627
01:01:49,914 --> 01:01:53,000
మళ్లీ పునర్జన్మ పొందుతోంది

628
01:01:53,668 --> 01:01:55,836
{\an8}మరో… నేను!

629
01:01:55,837 --> 01:02:01,425
గాలి, వాన, హరివిల్లు

630
01:02:01,426 --> 01:02:05,721
ఓ పాటగా మారేను

631
01:02:05,722 --> 01:02:09,850
ఈ లోకం

632
01:02:09,851 --> 01:02:11,893
ఎంతో అందమైనది

633
01:02:11,894 --> 01:02:15,480
నాలోని బీజాన్ని

634
01:02:15,481 --> 01:02:19,276
మొలకెత్తనివ్వు

635
01:02:19,277 --> 01:02:25,908
నాలో ఉన్నది ఉన్నట్టుగా

636
01:02:30,621 --> 01:02:36,168
ప్రేమంటే ఏమిటో తెలుపు

637
01:02:36,169 --> 01:02:42,007
అది జగమంతా తెలిసిన అద్భుతమే

638
01:02:42,008 --> 01:02:46,344
ఈ మదిని నింపేనులే

639
01:02:46,345 --> 01:02:51,558
ప్రేమ గురించిన ప్రతీదీ తెలుపు

640
01:02:51,559 --> 01:02:55,228
అదే నా జీవన గమ్యం

641
01:02:55,229 --> 01:03:01,693
నా మనసు చేజారకముందే

642
01:03:01,694 --> 01:03:06,948
ప్రేమంటే ఏమిటో తెలుపు

643
01:03:06,949 --> 01:03:12,789
అది జగమంతా తెలిసిన అద్భుతమే

644
01:03:37,396 --> 01:03:39,982
నీకు అకస్మాత్తుగా స్పృహ తప్పింది.

645
01:03:41,818 --> 01:03:42,734
నేను చూశాను…

646
01:03:42,735 --> 01:03:44,986
- నువ్వు జీవిస్తున్న కాలాన్ని.
- ఏంటి?

647
01:03:44,987 --> 01:03:47,365
నేను కాలం గుండా ప్రయాణించాను.

648
01:03:51,410 --> 01:03:53,078
{\an8}అలాగే ఆ తర్వాత…

649
01:03:53,079 --> 01:03:56,332
{\an8}హిజిరీ, నువ్వు అద్భుతంగా నాట్యమాడావు.

650
01:03:58,626 --> 01:03:59,876
{\an8}అది బహుశా నేను కాదేమో.

651
01:03:59,877 --> 01:04:03,964
{\an8}లేదు. నువ్వే ముందుకు నడిపించావు.

652
01:04:03,965 --> 01:04:06,634
{\an8}నేను నిజంగా సంతోషించాను.

653
01:04:09,679 --> 01:04:12,890
{\an8}నేను మరో కాలంలో పుట్టి ఉంటే,

654
01:04:13,933 --> 01:04:16,352
{\an8}నేను మరో మనిషిలా ఉండేదాన్నా?

655
01:04:17,812 --> 01:04:21,690
{\an8}ఈ బాధ, నిరాశలు అన్నింటి నుండి

656
01:04:21,691 --> 01:04:25,987
{\an8}నేను తప్పించుకుని ఉండేదాన్నా?

657
01:04:27,363 --> 01:04:29,824
{\an8}స్కార్లెట్, ఏడవకు.

658
01:04:29,949 --> 01:04:31,325
{\an8}నేను ఇక్కడే ఉన్నాను.

659
01:04:31,951 --> 01:04:35,204
నువ్వు ఇకపై ఏడవాల్సిన అవసరం లేదు.

660
01:06:11,425 --> 01:06:12,510
ఓయ్.

661
01:06:13,678 --> 01:06:15,680
నువ్వు యువరాణివా?

662
01:06:18,224 --> 01:06:19,391
కాదు.

663
01:06:19,392 --> 01:06:22,103
చాలా అందంగా ఉన్నావు,
కచ్చితంగా యువరాణివే.

664
01:06:24,063 --> 01:06:27,774
నేను యువరాణిగా పుడితే బాగుండేది.

665
01:06:27,775 --> 01:06:30,236
నువ్వు కూడా అదే కోరుకుంటావని
పందెం. అవునా?

666
01:06:32,571 --> 01:06:36,950
నేను కనుక యువరాణినైతే,
నేను చేయాలనుకునే పని ఒకటుంది.

667
01:06:36,951 --> 01:06:37,993
ఏమిటది?

668
01:06:37,994 --> 01:06:41,247
మా లాంటి పిల్లలు చనిపోవాల్సిన అవసరం లేని
ప్రపంచాన్ని నిర్మించాలి.

669
01:06:50,089 --> 01:06:50,923
అవును.

670
01:07:04,270 --> 01:07:05,895
అమరత్వం…

671
01:07:05,896 --> 01:07:11,234
ఈ స్వర్గం పవిత్ర పర్వతాల
శిఖరానికి పైన ఉంది!

672
01:07:11,235 --> 01:07:15,572
బలవంతులకు మాత్రమే ప్రవేశించడానికి
అర్హత ఉంది. వినండి!

673
01:07:15,573 --> 01:07:20,077
దాని దరిదాపుల్లోకి
ఇతరులు ఎవరినీ రానీయకండి!

674
01:07:27,126 --> 01:07:28,877
యువరాణిని కనిపెట్టే పని
మాకు ఈయండి,

675
01:07:28,878 --> 01:07:32,881
- గిల్డెన్ స్టెర్న్ ఇంకా…
- నాకు, రోసెన్ క్రాంజ్!

676
01:07:32,882 --> 01:07:36,385
- మేము ఆమెను త్వరగా కనిపెడతాము…
- అలాగే అమరత్వానికి వెళ్తాము.

677
01:07:38,763 --> 01:07:40,264
- యాహూ!
- యాహూ!

678
01:07:59,533 --> 01:08:01,993
మమ్మల్ని అమరత్వం వైపు వెళ్లనివ్వండి!

679
01:08:01,994 --> 01:08:03,828
మమ్మల్ని ఆ శిఖరంపైకి తీసుకెళ్లండి!

680
01:08:03,829 --> 01:08:06,456
శిఖరంపైకి!

681
01:08:06,457 --> 01:08:08,250
ఆ గోడను తొలగించండి!

682
01:08:08,834 --> 01:08:11,003
- వెళ్లండి!
- లేదంటే మేము కాల్చేస్తాం!

683
01:08:42,827 --> 01:08:45,913
పదండి! అమరత్వం దగ్గరలోనే ఉంది!

684
01:09:01,220 --> 01:09:03,263
క్లాడియస్ సైనికుల అంతు చూడండి!

685
01:09:03,264 --> 01:09:05,390
అమరత్వం వాళ్ల సొత్తు కాదు!

686
01:09:05,391 --> 01:09:06,684
దాడి చేయండి!

687
01:10:17,755 --> 01:10:20,381
- దయచేసి.
- నన్ను చంపకండి.

688
01:10:20,382 --> 01:10:22,967
- కంగారు పడకు.
- మేము వెతుకుతున్నాము అంతే.

689
01:10:22,968 --> 01:10:25,511
వెతుకుతున్నారా? ఎవరికోసం వెతుకుతున్నారు?

690
01:10:25,512 --> 01:10:26,889
యువరాణి కోసం!

691
01:10:29,350 --> 01:10:31,100
ఆమెను ఎవరైనా చూశారా?

692
01:10:31,101 --> 01:10:33,771
ఆమె జుట్టు వెనక్కి అల్లి ఉంటుంది.

693
01:10:35,522 --> 01:10:37,608
- ఇదిగో ఇలా!
- ఆగు!

694
01:10:38,525 --> 01:10:40,818
- ఆమె జుట్టు ఇలా ఉంటుంది!
- నొప్పిగా ఉంది…

695
01:10:40,819 --> 01:10:43,446
- ఆమెను తిరిగి ఇవ్వు!
- నోరు మూసుకో!

696
01:10:43,447 --> 01:10:46,574
యువరాణిని మాకు అప్పగించిన వారికి
విముక్తి దొరుకుతుంది!

697
01:10:46,575 --> 01:10:50,870
అంతేకాదు, మాతో పాటు అమరత్వానికి రావచ్చు!

698
01:10:50,871 --> 01:10:52,121
అవన్నీ అబద్ధాలు!

699
01:10:52,122 --> 01:10:54,833
నేను ఎప్పటికీ మీ బానిసను కాను.

700
01:10:55,501 --> 01:10:59,504
అయితే ఎప్పటికీ మృతుల లోకంలో
పాకులాడుతూనే ఉండు.

701
01:10:59,505 --> 01:11:00,506
వేరే చోట వెతుకుదాం.

702
01:11:03,842 --> 01:11:04,802
ఆగు.

703
01:11:06,637 --> 01:11:07,763
ఇదేంటి?

704
01:11:09,431 --> 01:11:14,186
డెన్మార్క్ కు చెందిన బంగారు నాణెం.
నీ దగ్గర ఇదెందుకు ఉంది?

705
01:11:16,730 --> 01:11:21,067
నీకు యువరాణి గురించి ఏదైనా తెలుసా?

706
01:11:21,068 --> 01:11:22,902
నాకేమీ తెలియదు!

707
01:11:22,903 --> 01:11:25,446
నా దగ్గర దాచకు. చెప్పు!

708
01:11:25,447 --> 01:11:27,031
నువ్వు చెప్పకపోతే…

709
01:11:27,032 --> 01:11:29,660
ఆపు! ఆమెను గాయపరచకు!

710
01:11:31,412 --> 01:11:32,662
యువరాణియేనా?

711
01:11:32,663 --> 01:11:34,456
మనకు యువరాణి దొరికింది!

712
01:11:36,458 --> 01:11:37,710
ఆమెను లేపండి!

713
01:11:39,378 --> 01:11:40,713
{\an8}యువరాణి…

714
01:11:42,089 --> 01:11:43,006
{\an8}యువరాణీ!

715
01:11:43,007 --> 01:11:45,342
త్వరగా పారిపో! వెళ్లు!

716
01:11:45,968 --> 01:11:48,303
మనం యువరాణిని పట్టుకున్నాం!

717
01:11:48,304 --> 01:11:50,305
రాజు క్లాడియస్ మనను మెచ్చుకుంటాడు!

718
01:11:50,306 --> 01:11:53,767
- దీనితో…
- ఆయన మనల్ని అమరత్వానికి తీసుకెళ్తాడు!

719
01:11:58,355 --> 01:11:59,315
స్కార్లెట్!

720
01:12:06,155 --> 01:12:08,907
- ఎవడ్రా నువ్వు?
- ఆమెను వదిలేయండి!

721
01:12:11,785 --> 01:12:13,037
కాల్చలేవా?

722
01:12:14,496 --> 01:12:15,872
నిన్ను ఏది ఆపుతోంది?

723
01:12:15,873 --> 01:12:17,915
అదేమైనా బొమ్మా?

724
01:12:17,916 --> 01:12:20,461
బహుశా ఈ కుర్రాడికి
విల్లు ఎలా వాడాలో తెలియదేమో.

725
01:12:23,547 --> 01:12:27,551
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?

726
01:12:28,385 --> 01:12:29,469
నేను…

727
01:12:29,470 --> 01:12:33,639
ఏ కారణం చేత ఈ ప్రదేశంలో ఉన్నావు?

728
01:12:33,640 --> 01:12:34,892
నేను…

729
01:12:50,741 --> 01:12:51,742
నేను…

730
01:12:53,243 --> 01:12:54,745
నేను…

731
01:13:32,991 --> 01:13:33,826
{\an8}హిజిరీ!

732
01:13:37,538 --> 01:13:38,789
బాగానే ఉన్నావా?

733
01:13:39,790 --> 01:13:42,333
బాగున్నాను. నువ్వో?

734
01:13:42,334 --> 01:13:43,544
బాగున్నాను.

735
01:13:48,132 --> 01:13:49,799
నువ్వు బతకాలి.

736
01:13:49,800 --> 01:13:50,843
నేను బతుకుతాను.

737
01:14:15,993 --> 01:14:18,370
ప్రేమంటే

738
01:14:19,037 --> 01:14:24,251
ఏమిటో తెలుపు

739
01:14:25,627 --> 01:14:31,757
అది జగమంతా

740
01:14:31,758 --> 01:14:34,344
తెలిసిన అద్భుతమే

741
01:14:35,554 --> 01:14:40,851
ఈ మదిని నింపేనులే

742
01:14:42,811 --> 01:14:45,480
ప్రేమ గురించిన

743
01:14:45,481 --> 01:14:50,402
ప్రతీదీ తెలుపు

744
01:14:52,112 --> 01:14:56,783
అదే నా జీవన గమ్యం

745
01:14:58,243 --> 01:15:00,745
నా మనసు

746
01:15:00,746 --> 01:15:06,752
చేజారకముందే

747
01:15:08,712 --> 01:15:11,088
ప్రేమంటే

748
01:15:11,089 --> 01:15:17,012
ఏమిటో తెలుపు

749
01:15:18,180 --> 01:15:23,310
అది జగమంతా

750
01:15:24,144 --> 01:15:26,522
తెలిసిన అద్భుతమే

751
01:15:27,814 --> 01:15:32,819
ఈ మదిని నింపేనులే

752
01:15:34,780 --> 01:15:39,825
ప్రేమ గురించిన

753
01:15:39,826 --> 01:15:42,329
ప్రతీదీ తెలుపు

754
01:15:43,413 --> 01:15:49,043
ఎక్కడో

755
01:15:49,044 --> 01:15:51,630
దాగిన ఓ రహస్యం

756
01:15:52,631 --> 01:15:57,636
ఆ గుట్టు విప్పు నాకోసం

757
01:16:10,107 --> 01:16:13,277
- క్లాడియస్ ను ఓడించండి!
- కోట వైపు వెళ్లండి!

758
01:16:21,910 --> 01:16:23,953
- అతను ఇక్కడ లేడు.
- అతను ఎక్కడున్నాడు?

759
01:16:23,954 --> 01:16:25,872
- అతను పారిపోయాడా?
- ఛ!

760
01:16:38,885 --> 01:16:41,930
అప్పుడే మళ్లీ తెల్లారిపోయింది.

761
01:16:51,398 --> 01:16:52,649
మన్నించు.

762
01:17:29,144 --> 01:17:31,479
ఇదే ఆ శిఖరం.

763
01:17:31,480 --> 01:17:34,900
కానీ… అమరత్వానికి దారితీసే మెట్లు లేవు!

764
01:17:37,569 --> 01:17:38,654
అది ఇక్కడ లేదు.

765
01:17:41,865 --> 01:17:44,533
మా బాబాయి ఇక్కడే ఉంటాడని అనుకున్నాను.

766
01:17:44,534 --> 01:17:46,536
- ఆయన ఇక్కడ లేడు.
- ఏంటి?

767
01:17:48,330 --> 01:17:50,998
ఆయన ఎప్పుడో అమరత్వాన్ని చేరుకున్నారు.

768
01:17:50,999 --> 01:17:54,586
అలాగే మృతుల లోకంలో
నువ్వు శూన్యంగా మారిపోతావు.

769
01:18:10,727 --> 01:18:11,978
- స్కార్లెట్!
- హే, ఇక ఆగు!

770
01:18:16,066 --> 01:18:19,860
కిందపడి చావడం లేదా కత్తితో చావడం.

771
01:18:19,861 --> 01:18:21,363
ఏదైనా నీ ఇష్టం.

772
01:18:30,247 --> 01:18:31,331
నువ్వా?

773
01:18:31,998 --> 01:18:35,502
- కార్నీలియస్!
- మనలో ద్రోహి ఉన్నాడా?

774
01:18:39,047 --> 01:18:42,258
మేము నిన్ను బాగా శిక్షించాము,
అలాగే నీ ఆయుధాలు తీసుకున్నాము,

775
01:18:42,259 --> 01:18:43,884
అయినా సరే ఇంకా నిలబడుతున్నావా?

776
01:18:43,885 --> 01:18:45,302
ద్రోహి!

777
01:18:45,303 --> 01:18:48,432
ఈసారి ఎలాంటి జాలి ఉండదు,
తూటాలు మాత్రమే!

778
01:18:49,474 --> 01:18:50,725
వోల్టెమాండ్!

779
01:18:50,726 --> 01:18:54,311
ద్రోహులైన కుక్కలారా!
యువరాణి వైపు ఎందుకు నిలబడ్డావు?

780
01:18:54,312 --> 01:18:56,314
మీ కుక్కల్లా ఉండటం మా వల్ల కాదు.

781
01:18:57,023 --> 01:18:59,109
అలాగే నీతో కూడా నేను విసిగిపోయాను.

782
01:19:00,360 --> 01:19:03,155
చేతికర్ర ఉన్న ఓ కుంటివాడు
నన్ను ఎప్పటికీ ఓడించలేడు!

783
01:19:08,410 --> 01:19:10,537
శూన్యంలో కనుమరుగైపో!

784
01:19:18,837 --> 01:19:20,172
అబ్బా ఛ!

785
01:19:26,595 --> 01:19:28,013
జరుగు, వోల్టెమాండ్!

786
01:19:28,680 --> 01:19:31,057
కార్నీలియస్! శూన్యంగా మారిపో!

787
01:19:48,492 --> 01:19:50,786
నీ లక్ష్యం అక్కడుంది.

788
01:20:01,046 --> 01:20:03,965
ఇంత దూరం వచ్చావు.
వెళ్లి నీ ప్రతీకారం తీర్చుకో.

789
01:20:12,182 --> 01:20:14,059
ధన్యవాదాలు.

790
01:22:56,846 --> 01:22:57,847
అదేనా…?

791
01:23:04,562 --> 01:23:05,897
ఓ గొప్ప ద్వారమా!

792
01:23:06,648 --> 01:23:08,858
అమరత్వపు తలుపు!

793
01:23:09,567 --> 01:23:11,486
నేనే రాజును!

794
01:23:12,529 --> 01:23:13,904
క్లాడియస్!

795
01:23:13,905 --> 01:23:17,867
{\an8}అయినా నీ తలుపులు ఎందుకు మూసుకున్నావు?

796
01:23:18,576 --> 01:23:20,787
{\an8}ఎందుకు?

797
01:23:24,207 --> 01:23:25,291
{\an8}శాపాలు!

798
01:23:26,001 --> 01:23:28,920
{\an8}నేను ఇంత దూరం వచ్చాను.
నేను ఏం కోల్పోయాను?

799
01:23:36,970 --> 01:23:38,596
ఈ రక్తపు చేతులు…

800
01:23:39,222 --> 01:23:42,182
నా పాపాలు. ఓ, నా తప్పు పెద్దది…

801
01:23:42,183 --> 01:23:44,853
ఇప్పుడు మోక్షానికై ప్రార్థించడం తప్ప
చేయగలిగేదేమీ లేదు.

802
01:23:45,353 --> 01:23:48,147
లేదా అలాంటి వాటికి చాలా ఆలస్యమైందా?

803
01:23:48,148 --> 01:23:49,190
ఇప్పుడు ఎలా?

804
01:23:49,733 --> 01:23:52,776
నేనింకా నా పాపాలను మోస్తూనే ఉన్నాను.

805
01:23:52,777 --> 01:23:56,030
ఆ కిరీటం, ఆ ఆశయం, అలాగే మహారాణి…

806
01:23:56,031 --> 01:23:57,615
ఎవరైనా క్షమను పొందడం ఎలా?

807
01:24:00,160 --> 01:24:01,286
పశ్చాత్తాపం…

808
01:24:01,911 --> 01:24:04,289
ఇదొక్కటే దారి. నేను పశ్చాత్తాప పడాలి.

809
01:24:08,543 --> 01:24:13,213
నన్ను క్షమించు, నేను చాలా పాపాలు చేశాను.

810
01:24:13,214 --> 01:24:14,549
నన్ను కాపాడు.

811
01:24:22,223 --> 01:24:26,810
అమరత్వాన్ని కోరుకునే
లెక్కలేనంత మంది బాధితుల కోసం

812
01:24:26,811 --> 01:24:29,063
నేను నా శాయశక్తులా కష్టపడ్డాను.

813
01:24:29,064 --> 01:24:31,941
అందుకే దయచేసి నన్ను కాపాడు…

814
01:25:16,152 --> 01:25:19,823
రాజా క్లాడియస్, నీ నిజమైన ఉద్దేశాలు
నాకు అర్థమయ్యాయి.

815
01:25:20,657 --> 01:25:21,783
అయితే,

816
01:25:22,534 --> 01:25:24,536
నేను నిన్ను ఒక విషయం అడగాలి.

817
01:25:25,120 --> 01:25:28,080
దయచేసి, నువ్వు చేసింది తప్పని ఒప్పుకో.

818
01:25:28,081 --> 01:25:30,707
మా నాన్నను చంపడం పొరపాటు అని ఒప్పుకో.

819
01:25:30,708 --> 01:25:33,169
ఆయన కూతురిని క్షమాపణ అడుగు.

820
01:25:55,191 --> 01:25:56,359
బాబాయ్.

821
01:26:01,114 --> 01:26:02,282
బాబాయ్.

822
01:26:04,617 --> 01:26:06,368
క్షమాపణ అడగాలా?

823
01:26:06,369 --> 01:26:07,287
బలే తమాషా!

824
01:26:09,873 --> 01:26:12,666
నాకిప్పుడు ఉన్నది ఒకే ఒక్క పశ్చాత్తాపం.

825
01:26:12,667 --> 01:26:17,671
మీ నాన్నను చంపే ముందు ఆయనను
మరింతగా హింసించకపోవడమే నా తప్పు.

826
01:26:17,672 --> 01:26:21,592
అప్పుడు నువ్వు భయంతో వణికిపోయి
నన్నెప్పుడూ ఎదిరించకుండా ఉండేదానివి!

827
01:26:21,593 --> 01:26:24,094
నేను అతని రక్తాన్ని కారేలా చేసి,

828
01:26:24,095 --> 01:26:26,555
ఆయన ఎముకల నుండి మాంసాన్ని తీసేయాల్సింది,

829
01:26:26,556 --> 01:26:29,183
అతను తన ప్రాణాలు తీసి కాపాడుమని
నన్ను బతిమిలాడే వరకు.

830
01:26:29,184 --> 01:26:31,101
నేను నిన్ను అది చూసేలా చేసి ఉంటే,

831
01:26:31,102 --> 01:26:33,520
నువ్వు ఈ పిచ్చి, మూర్ఖపు మాటలతో

832
01:26:33,521 --> 01:26:37,232
ఇప్పుడు నా ముందుకు వచ్చేదానివి కాదు!

833
01:26:37,233 --> 01:26:42,404
ఇందాక నువ్వు పడ్డ పశ్చాత్తాపం,
లేదా ప్రజల కోసం పడిన కష్టం సంగతేంటి?

834
01:26:42,405 --> 01:26:45,782
నాతో పాటు ఇతరులను తీసుకురావడంలో
ఏం లాభం ఉంటుంది?

835
01:26:45,783 --> 01:26:48,369
{\an8}అమరత్వం నాది!

836
01:26:48,870 --> 01:26:50,622
{\an8}నాది, కేవలం నాది మాత్రమే!

837
01:26:57,545 --> 01:27:03,050
దురాశ నిండిన హృదయం గల నీచుడైన
ఒక మనిషి ఇక్కడ ఎలా ఉన్నాడు?

838
01:27:03,051 --> 01:27:06,094
నువ్వు ఇతరుల ఆశలను తొక్కిపారేస్తావు.

839
01:27:06,095 --> 01:27:08,765
నువ్వు అమరత్వంలోకి ఎలా ప్రవేశించగలవు?

840
01:27:09,390 --> 01:27:13,268
{\an8}నీ వల్ల మా నాన్న పడిన బాధ,
పశ్చాత్తాపంలో కొంచెమైనా

841
01:27:13,269 --> 01:27:16,480
{\an8}నీకు రుచి చూపించాలా?

842
01:27:16,481 --> 01:27:17,649
{\an8}నేను నీకు చూపించాలా?

843
01:27:23,529 --> 01:27:24,822
క్షమించు.

844
01:27:29,535 --> 01:27:30,870
క్షమించు.

845
01:27:49,013 --> 01:27:53,308
నేను నా ప్రతీకారం తీర్చుకోవాలా?

846
01:27:53,309 --> 01:27:55,645
లేదా నేను అందరినీ క్షమించాలా?

847
01:28:00,191 --> 01:28:03,068
నేను ఎందుకిలా బాధపడాలి?

848
01:28:03,069 --> 01:28:05,237
నన్ను బంధించేది ఏంటి?

849
01:28:05,238 --> 01:28:06,363
నాకు తెలియదు!

850
01:28:06,364 --> 01:28:08,907
నేను బతకడానికి వేరే దారి కనుక్కోలేనా?

851
01:28:08,908 --> 01:28:12,786
నాకు తెలియదు!

852
01:28:12,787 --> 01:28:14,246
అయితే నాకు ఎలాంటి ఆశ లేదు.

853
01:28:14,247 --> 01:28:18,166
నేనేమీ చేయలేను!
నేను ఇంత కాలంగా బతికింది ఇలాగే!

854
01:28:18,167 --> 01:28:21,629
నిజమే. అయితే, నాకు ఎలాంటి ఆశ లేదు,
అలాగే ఇదే ముగింపు.

855
01:28:23,673 --> 01:28:25,841
కత్తిసాము నేర్చుకునేలా
ద్వేషమే నడిపించింది.

856
01:28:25,842 --> 01:28:29,511
ప్రతీకారం కోసం, మా నాన్న కోసం,
అలాగే బాధపడుతున్న అందరి కోసం.

857
01:28:29,512 --> 01:28:34,182
నన్ను నేను ఆపుకున్నాను, మళ్లీ మళ్లీ.

858
01:28:34,183 --> 01:28:37,519
"పరిస్థితులు ఇలా ఉండకూడదు," అని
నాకు నేనే చెప్పుకున్నాను.

859
01:28:37,520 --> 01:28:41,149
ఇప్పటి వరకు, నన్ను నేను క్షమించుకోకుండా
నా జీవితాన్ని గడిపాను,

860
01:28:42,317 --> 01:28:44,819
నన్ను నేను క్షమించుకోకుండా…

861
01:28:46,863 --> 01:28:50,700
నన్ను నేను క్షమించుకోకుండా.

862
01:28:56,039 --> 01:28:57,414
నన్ను నేను.

863
01:28:57,415 --> 01:28:58,874
క్షమించు.

864
01:28:58,875 --> 01:29:00,751
నన్ను నేను…

865
01:29:00,752 --> 01:29:02,045
క్షమించు.

866
01:29:23,941 --> 01:29:25,026
స్కార్లెట్.

867
01:29:37,080 --> 01:29:38,247
స్కార్లెట్.

868
01:29:39,332 --> 01:29:40,624
నాన్నా!

869
01:29:40,625 --> 01:29:45,880
నా పేరు మీద ప్రతీకారం తీర్చుకునే
ఈ మూర్ఖత్వాన్ని ఆపు.

870
01:29:47,632 --> 01:29:52,135
నువ్వు కోరుకునే మరో "నువ్వు"
కచ్చితంగా ఉంటుంది.

871
01:29:52,136 --> 01:29:56,808
అది ద్వేషం, ప్రతీకారాలతో
నిండిపోయి ఉండదు.

872
01:29:59,268 --> 01:30:02,563
నీ జీవితాన్ని జీవిస్తూ, దాన్ని నిధిలా
కాపాడుకోవాలని నా కోరిక.

873
01:30:05,733 --> 01:30:09,237
నువ్వు స్వేచ్ఛగా బతుకుతూ మెరిసిపోవడం
నేను చూడాలి.

874
01:30:09,904 --> 01:30:11,155
నాన్నా.

875
01:30:38,641 --> 01:30:40,183
బాగా విను.

876
01:30:40,184 --> 01:30:44,146
ఇది నీలాంటి అమ్మాయి కోసం,
పరాజితుడి కూతురి కోసం కాదు!

877
01:30:44,147 --> 01:30:47,065
అమరత్వం నాది.

878
01:30:47,066 --> 01:30:48,900
వేరే ఎవరికీ ప్రవేశం లేదు.

879
01:30:48,901 --> 01:30:53,613
నేను అలాగే నా మహారాణి మాత్రమే
ఈ ద్వారం గుండా వెళ్తాము!

880
01:30:53,614 --> 01:30:55,490
{\an8}శూన్యంలోకి పడిపో!

881
01:30:55,491 --> 01:30:57,493
నీ దిక్కుమాలిన తండ్రిని అనుసరించు!

882
01:31:04,834 --> 01:31:07,627
నేను నిన్ను క్షమించను.

883
01:31:07,628 --> 01:31:09,881
నేను నిన్ను క్షమించలేను. అయితే…

884
01:31:11,632 --> 01:31:13,341
నేను పోరాడటం ఆపేశాను.

885
01:31:13,342 --> 01:31:17,096
గొడవలకు ముగింపు పలకాలని
కోరుకున్న వారందరి కోసం.

886
01:31:18,639 --> 01:31:21,766
అంటే భవిష్యత్తులో ప్రజలు
శాంతియుతంగా కలిసి జీవించడానికి

887
01:31:21,767 --> 01:31:23,769
ఒక అవకాశం ఉంటుంది.

888
01:31:26,355 --> 01:31:29,983
{\an8}నీ అర్థం లేని ఆదర్శాలను
అందమైన మాటల్లో చెప్పుకో, మూర్ఖురాలా!

889
01:31:29,984 --> 01:31:32,528
{\an8}ఎలాంటి ఆనవాలు లేకుండా
నువ్వు కనుమరుగైపోతావు!

890
01:32:16,572 --> 01:32:18,574
గెర్ట్రూడ్!

891
01:32:19,283 --> 01:32:21,744
దయచేసి! నన్ను కాపాడు!

892
01:32:22,870 --> 01:32:24,288
అమరత్వం అంటే…

893
01:32:25,039 --> 01:32:26,457
గెర్ట్రూడ్!

894
01:32:27,416 --> 01:32:30,628
అమరత్వం మన ముందే ఉంది…

895
01:32:33,464 --> 01:32:35,548
నాకు కనుమరుగవ్వాలని లేదు!

896
01:32:35,549 --> 01:32:37,842
నన్ను శూన్యంగా మారనివ్వకు!

897
01:32:37,843 --> 01:32:40,096
నాకు కనుమరుగవ్వాలని లేదు!

898
01:32:41,430 --> 01:32:42,932
నన్ను కాపాడు!

899
01:32:47,186 --> 01:32:48,771
{\an8}గెర్ట్రూడ్!

900
01:32:49,647 --> 01:32:52,316
{\an8}నన్ను కాపాడు! నాకు చనిపోవాలని లేదు!

901
01:32:52,942 --> 01:32:55,319
{\an8}నాకు చనిపోవాలని లేదు!

902
01:33:50,458 --> 01:33:51,584
ఎట్టకేలకు…

903
01:33:53,127 --> 01:33:56,004
ఎట్టకేలకు నేను అనుకున్నవి సాధించాను.

904
01:33:56,005 --> 01:33:59,299
ఇప్పుడు ప్రశాంతంగా
నేను కనుమరుగవ్వగలను.

905
01:33:59,300 --> 01:34:02,178
నువ్వు పొరబడుతున్నావు, స్కార్లెట్.

906
01:34:02,845 --> 01:34:04,138
ఏంటి?

907
01:34:05,264 --> 01:34:11,061
మనుషులు ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని పరలోకం అని,

908
01:34:11,062 --> 01:34:12,687
అమరత్వం అని ఇంకా ఏవేవో అంటారు.

909
01:34:12,688 --> 01:34:14,856
కానీ వాళ్లు పూర్తిగా పొరబడ్డారు.

910
01:34:14,857 --> 01:34:19,903
ఇది జీవన్మరణాలు కలిసుండే ప్రపంచమే గాని,
సంఘర్షణ ఉండేది కాదు.

911
01:34:19,904 --> 01:34:22,947
జీవన్మరణాలే కాదు, కాలం కూడా.

912
01:34:22,948 --> 01:34:27,160
ఇక్కడ గతం, భవిష్యత్తులు కలగలిసిపోతాయి.

913
01:34:27,161 --> 01:34:30,414
అందుకే మీరు కలిసున్నారు.

914
01:34:31,415 --> 01:34:32,500
ఇప్పుడు,

915
01:34:33,626 --> 01:34:38,755
మీ ఇద్దరిలో ఒకరు ఇంకా బతికే ఉన్నారు.

916
01:34:38,756 --> 01:34:40,715
చనిపోలేదా?

917
01:34:40,716 --> 01:34:45,095
బతికున్నవారు మేల్కొనే సమయం
వేగంగా సమీపిస్తోంది.

918
01:34:45,096 --> 01:34:47,555
ఆ వ్యక్తి ఇక్కడ ఉండకూడదు.

919
01:34:47,556 --> 01:34:53,061
వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారో
అక్కడికి తిరిగి వెళ్లే సమయం ఆసన్నమైంది.

920
01:34:53,062 --> 01:34:55,855
సరే. మీ ఉద్దేశం అతనే.

921
01:34:55,856 --> 01:34:59,067
తను చనిపోలేదని
అతను మొదటినుంచీ చెప్తున్నాడు.

922
01:34:59,068 --> 01:35:02,195
అతను ఏదో పొరపాటున
ఇక్కడికి వచ్చానన్నాడు. అందుకే…

923
01:35:02,196 --> 01:35:04,239
నువ్వు పొరబడుతున్నావు.
అది నేను కాదు.

924
01:35:04,240 --> 01:35:05,241
ఏంటి?

925
01:35:05,908 --> 01:35:08,119
అది నువ్వే, స్కార్లెట్.

926
01:35:10,162 --> 01:35:12,790
నాకిప్పుడు గుర్తొస్తోంది.
నేను నిజంగా చనిపోయాను.

927
01:35:13,958 --> 01:35:15,834
ఈఆర్ కార్యాలయం నుండి అంబులెన్స్ లకు.

928
01:35:15,835 --> 01:35:19,296
అంబులెన్స్ లను పంపించాము.
ఇద్దరు అపస్మారక స్థితిలో కనిపించారు.

929
01:35:21,132 --> 01:35:22,800
ఈఆర్ ప్రధాన కార్యాలయం నుండి అంతే.

930
01:35:24,176 --> 01:35:27,137
అత్యవసరం. ఈఆర్ ప్రధాన కార్యాలయం నుండి
అన్ని విభాగాలకు.

931
01:35:27,138 --> 01:35:30,014
కత్తి దాడి జరిగినట్లు అనుమానం.

932
01:35:30,015 --> 01:35:32,016
నిందితుడిని ఇంకా పట్టుకోలేదు.

933
01:35:32,017 --> 01:35:34,854
నిందితుని కదలికల పట్ల అప్రమత్తంగా ఉండండి.

934
01:35:38,190 --> 01:35:39,483
నేను చనిపోవాలని అనుకోలేదు.

935
01:35:40,192 --> 01:35:42,862
కేవలం నా సహజమైన ప్రవృత్తితో
వాళ్ల మధ్యకు వెళ్లాను.

936
01:35:43,446 --> 01:35:46,656
అందుకే నేను చనిపోయానని గ్రహించలేకపోయాను.

937
01:35:46,657 --> 01:35:48,826
నేను బతికే ఉన్నానని నమ్ముతూ వచ్చాను.

938
01:35:50,494 --> 01:35:55,082
నేను చనిపోయాను. నువ్వే బతికున్నావు.

939
01:36:00,004 --> 01:36:01,796
అది నేను కాదు.

940
01:36:01,797 --> 01:36:03,340
అది నేను కాకూడదు!

941
01:36:11,599 --> 01:36:13,642
కత్తి నా అవయవాలను చేరుకుంది.

942
01:36:14,727 --> 01:36:17,604
నేను కాసేపు రక్తం కారకుండా ఆపాను,

943
01:36:17,605 --> 01:36:19,273
కానీ అది మళ్లీ మొదలైంది.

944
01:36:25,863 --> 01:36:27,197
లేదు…

945
01:36:27,198 --> 01:36:29,199
నువ్వు పొరబడుతున్నావు! అది నేను కాదు!

946
01:36:29,200 --> 01:36:31,202
హిజిరీ! నువ్వు బతకాలి!

947
01:36:32,036 --> 01:36:35,748
అయితే నేను ఇక్కడే ఉంటాను! నీతోనే ఉంటాను!

948
01:36:37,666 --> 01:36:38,792
{\an8}ఓరి దేవుడా…

949
01:36:40,878 --> 01:36:43,671
హిజిరిని బతికించు, నన్ను కాదు!

950
01:36:43,672 --> 01:36:44,839
లేదు.

951
01:36:44,840 --> 01:36:46,800
దయచేసి! నా స్థానంలో అతను వెళ్లగలడు!

952
01:36:47,676 --> 01:36:48,802
కుదరదు.

953
01:37:01,065 --> 01:37:03,191
బతకాల్సింది నేను కాదు.

954
01:37:03,192 --> 01:37:06,278
ప్రతీకారం తీర్చుకోవాలనే పిచ్చితో
తహతహలాడినది నేను.

955
01:37:08,656 --> 01:37:09,532
లేదు.

956
01:37:10,324 --> 01:37:13,326
- నువ్వు బతకాలి, స్కార్లెట్.
- నాకు ఆ కోరిక లేదు.

957
01:37:13,327 --> 01:37:16,204
బతుకు. నీకు బతకాలని ఉందని
స్పష్టంగా చెప్పు.

958
01:37:16,205 --> 01:37:17,121
లేదు!

959
01:37:17,122 --> 01:37:18,873
నీకు బతకాలని ఉందని చెప్పు!

960
01:37:18,874 --> 01:37:21,251
లేదు! అంటే
నిన్ను వదిలిపెట్టడమే కదా, హిజిరీ!

961
01:37:21,252 --> 01:37:23,878
అలా జరిగినా పర్వాలేదు! నువ్వు బతకాలి!

962
01:37:23,879 --> 01:37:26,549
- నిన్ను విడిచిపెట్టడం ఇష్టం లేదు!
- బతకాలని ఉందని చెప్పు!

963
01:37:27,216 --> 01:37:30,261
దాన్ని మాటల్లో చెప్పు!
"నేను బతకాలని కోరుకుంటున్నాను!"

964
01:37:31,262 --> 01:37:34,097
నేను… బతకాలని… కోరుకుంటున్నాను.

965
01:37:34,098 --> 01:37:35,766
ఇంకా! "నేను బతకాలని కోరుకుంటున్నా!"

966
01:37:37,851 --> 01:37:39,144
నేను బతకాలని కోరుకుంటున్నా!

967
01:37:39,895 --> 01:37:43,565
- మరింత గట్టిగా!
- నేను బతకాలని కోరుకుంటున్నా!

968
01:37:43,566 --> 01:37:45,568
నేను బతకాలని కోరుకుంటున్నా!

969
01:37:46,527 --> 01:37:49,320
నేను బతుకుతాను, దానికి బదులుగా,

970
01:37:49,321 --> 01:37:51,364
నువ్వు పుట్టే సమయానికి,

971
01:37:51,365 --> 01:37:54,158
ఈ ప్రపంచాన్ని గొడవలు లేని
ప్రపంచంగా మారుస్తాను.

972
01:37:54,159 --> 01:37:58,831
ఒకవేళ భవిష్యత్తు మారితే,
కచ్చితంగా నువ్వు చనిపోవు, అవునా?

973
01:38:00,082 --> 01:38:03,919
అందుకోసం, నేను చేయగలిగేది
ఏదైనా చేస్తాను!

974
01:38:04,712 --> 01:38:07,590
అప్పుడు నువ్వు కూడా
ఎక్కువ కాలం బతకగలవు, హిజిరీ!

975
01:38:08,674 --> 01:38:12,552
నీకంటూ కుటుంబం ఉంటుంది,
పిల్లలను పెంచగలవు,

976
01:38:12,553 --> 01:38:14,888
అలాగే మంచి వృద్ధుడిగా ఎదగగలవు!

977
01:39:28,629 --> 01:39:31,006
అసలు మనిషిగా ఉండటం…

978
01:39:32,091 --> 01:39:33,676
అంటే ఏమిటి?

979
01:39:34,301 --> 01:39:36,011
మరణించడం అంటే ఏమిటి?

980
01:39:37,554 --> 01:39:38,972
జీవించడం అంటే ఏమిటి?

981
01:39:40,516 --> 01:39:41,809
అలాగే…

982
01:39:44,687 --> 01:39:47,231
ప్రేమ అంటే ఏంటి?

983
01:40:07,376 --> 01:40:09,794
యువరాణీ?

984
01:40:09,795 --> 01:40:11,171
యువరాణీ!

985
01:40:13,424 --> 01:40:15,300
యువరాణి మనలోకి తిరిగి వచ్చారు!

986
01:40:16,427 --> 01:40:19,011
- అసాధ్యం!
- విరుగుడు పనిచేసింది!

987
01:40:19,012 --> 01:40:21,014
ఇదొక అద్భుతం!

988
01:40:43,412 --> 01:40:46,290
మీరు కోమాలో ఉన్నప్పుడు ఇలా జరిగింది.

989
01:40:47,082 --> 01:40:51,962
తను చంపాలనుకున్న వాళ్ల కోసం
ఉంచిన కప్పులోని పానీయాన్ని తనే తాగేశాడు.

990
01:40:52,588 --> 01:40:53,464
ఆ తర్వాత…

991
01:40:54,381 --> 01:40:56,133
అతని మరణం అకస్మాత్తుగా జరిగింది.

992
01:41:01,305 --> 01:41:02,723
ఇంకా నువ్వెందుకు బతికున్నావు?

993
01:41:03,807 --> 01:41:05,850
నా భర్త ఎందుకు చనిపోయాడు,

994
01:41:05,851 --> 01:41:08,270
కానీ నువ్వు నరకంలో కాకుండా
ఇక్కడ ఎందుకున్నావు?

995
01:41:09,188 --> 01:41:10,189
ఎందుకు?!

996
01:41:23,535 --> 01:41:29,124
కచ్చితంగా నీ చేతులతోనే
ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకున్నావు.

997
01:41:31,293 --> 01:41:33,336
లేదు, అంతా పూర్తయింది.

998
01:41:33,337 --> 01:41:34,379
ఏంటి?

999
01:41:35,172 --> 01:41:38,842
చివరకు, నా ప్రయాణం ముగింపునకు వచ్చింది.

1000
01:41:40,511 --> 01:41:44,138
దేవుడు కొత్త మహారాణిని ఆశీర్వదించుగాక.

1001
01:41:44,139 --> 01:41:46,933
మన కొత్త మహారాణికి జయహో!

1002
01:41:46,934 --> 01:41:48,143
విజయం కలుగుగాక!

1003
01:42:02,241 --> 01:42:04,368
- మా కొత్త మహారాణి!
- ఏంటి?

1004
01:42:04,993 --> 01:42:09,914
గత రాజులాగే మమ్మల్ని అణచివేయబోరని
మీరు మాకు మాట ఇవ్వగలరా?

1005
01:42:09,915 --> 01:42:12,875
పేదలు కలకాలం మూర్ఖులుగా మిగిలిపోవడం చూసి
నేను అలసిపోయాను.

1006
01:42:12,876 --> 01:42:15,045
అది నిజం!

1007
01:42:23,595 --> 01:42:24,887
నా ప్రజలారా!

1008
01:42:24,888 --> 01:42:30,017
మీరు నన్ను
ఈ దేశానికి నాయకురాలిగా అంగీకరిస్తే,

1009
01:42:30,018 --> 01:42:33,647
అందరి సంతోషం కోసం
నేను సేవ చేస్తాను.

1010
01:42:37,693 --> 01:42:41,195
మన పొరుగువారితో స్నేహంగా,
విశ్వాసంగా ఉంటాను. శత్రుత్వంతో కాదు.

1011
01:42:41,196 --> 01:42:43,698
పిల్లల మరణాలను నివారిస్తాను.

1012
01:42:43,699 --> 01:42:46,826
బాధ, కష్టాలను భరించాల్సి వచ్చినా,
గొడవలు లేని దారిని

1013
01:42:46,827 --> 01:42:51,957
నేను కనుక్కునేంత వరకు, ఎప్పటికీ
ఆశ వదులుకోనని ప్రమాణం చేస్తున్నాను.

1014
01:42:55,002 --> 01:42:59,965
యుద్ధానికి ముగింపు పలకాలని ఆశిస్తూ
చనిపోయిన అందరి కోసం.

1015
01:43:03,010 --> 01:43:06,889
అలాగే సంతోషం కోసం ఆశపడుతూ
పుట్టబోయే వారందరి కోసం.

1016
01:43:13,896 --> 01:43:18,775
అసలు… భవిష్యత్తులో యుద్ధం లేని ప్రపంచం
నిజంగానే ఉండగలదా?

1017
01:43:21,403 --> 01:43:22,279
అవును.

1018
01:43:22,988 --> 01:43:25,741
మీ సహాయంతో, కచ్చితంగా ఉంటుంది.

1019
01:43:28,952 --> 01:43:32,706
అయితే, మేము కూడా మిమ్మల్ని నమ్ముతాము,
ఆశను ఎప్పటికీ వదిలిపెట్టము.

1020
01:43:33,290 --> 01:43:35,042
- నేను కూడా!
- నేను కూడా!

1021
01:43:35,792 --> 01:43:38,670
- మేము మీకు మద్దతు ఇస్తాము.
- మేము కూడా!

1022
01:43:43,717 --> 01:43:46,762
మన కొత్త నాయకురాలికి జయహో!

1023
01:43:48,013 --> 01:43:50,557
విజయం కలుగుగాక!

1024
01:44:33,058 --> 01:44:38,146
వేకువ లాంటి పసిడి వర్ణపు
మబ్బుల దారి

1025
01:51:04,032 --> 01:51:09,037
{\an8}ఉపశీర్షికలు అనువదించినది
కృష్ణమోహన్ తంగిరాల

